యువి క్రియేషన్స్ వరస్ట్ బేనర్.. ఈ మధ్య ట్విట్టర్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ పని చేసింది ప్రభాస్ అభిమానులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాహో మొదలైన దగ్గర్నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ సమయానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వదని, వారి కోసం కానుకలేమీ రెడీ చేయదని వాళ్లు మండిపడుతుంటారు.
ఈ విషయంలో ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ వద్దకెళ్లి గొడవ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. అయినా ఆ సంస్థ ప్రభాస్ కొత్త సినిమా విషయంలోనూ అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లు నడుచుకోవట్లేదు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ 70-80 శాతం పూర్తయినా ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ లేదు. వాటి గురించి అప్ డేట్ కూడా లేదు.
ఐతే ఈ మధ్య ప్రభాస్ అభిమానులు మరోసారి విరుచుకుపడేసరికి.. ఆ సంస్థ స్పందించింది. లాక్ డౌన్ ముగిసి, సినీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాక అప్ డేట్ ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సడలింపులిచ్చి షూటింగ్స్ త్వరలోనే పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సంస్థ మాట నిలుపుకోనుంది. సోమవారం చిత్ర పీఆర్ వర్గాలు ఈ మేరకు అభిమానులకు ఇన్ పుట్స్ ఇచ్చాయి.
జూన్ ప్రభాస్ అభిమానుల నెల అని.. వారికి కానుక సిద్ధమవుతోందని కొందరు టాలీవుడ్ పీఆర్వోలు సంకేతాలిచ్చారు. బహుశా ఈ నెల మధ్యలో టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశముంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధేశ్యామ్, జాన్ అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. యువి వాళ్లతో కలిసి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on June 2, 2020 12:53 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…