బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులకు పట్టుబడ్డారు. ముంబై నుంచి గోవాకి వెళ్తున్న ఓ ప్రైవేట్ క్రూజ్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు దాడి చేసి.. అక్కడ డ్రగ్స్ మత్తులో పార్టీ చేసుకుంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అందులో షారుఖ్ ఖాన్ కొడుకు కూడా ఉన్నాడు. అతడితో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.
అయితే కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నానని.. ఆర్యన్ ఎన్సీబీ అధికారులకు తెలిపాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అతడు ఏడుస్తూనే ఉన్నాడని సమాచారం. ఇండియాలోనే కాకుండా లండన్, దుబాయ్ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పాడు. కస్టడీలో ఉన్న తన కొడుకుతో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు షారుఖ్.
నేటితో ఆర్యన్ కస్టడీ ముగియనుంది. ఇప్పటివరకు ఆర్యన్ పై డ్రగ్స్ వినియోగ ఆరోపణలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ నేరానికి శిక్షగా రూ.20,000 లేదా ఒక ఏడాది జైలుకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే ఈరోజు సాధారణ కోర్టులో ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేస్తానని చెప్పారు.
This post was last modified on October 4, 2021 3:28 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…