యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్లోనే అత్యంత ఆలస్యమైన చిత్రం.. ఆరడుగుల బుల్లెట్. ఏడెనిమిదేళ్ల కిందట ప్రారంభోత్సవం జరుపుకుని, సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు అక్టోబరు 8న ‘ఆరడుగుల బుల్లెట్’ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేశారు. అది చూస్తే ఇది పక్కా మాస్ మసాలా మూవీ అని.. కమర్షియల్ మీటర్లో తెరకెక్కిందని అర్థమవుతోంది.
ఏ బాధ్యతా లేకుండా ఆవారాగా తిరిగే హీరో.. పనికి మాలిన వాడంటూ అతణ్ని తిడుతూ ఉండే తండ్రి.. మధ్యలో హీరో ప్రేమించే ఒక అందమైన అమ్మాయి.. ఇలా మామూలుగా హీరో జీవితం సాగిపోతుండగా.. అతడి తండ్రికి ఒక సమస్య వస్తుంది. బెజవాడను తన గుప్పెట్లో ఉంచుకున్న విలన్.. హీరో తండ్రికి సంబంధించిన ఆస్తి మీద కన్నేస్తాడు. ఆ క్రమంలో అతడిపై చేయి చేసుకుంటాడు. దీంతో హీరోకు వెర్రెత్తిపోయి తండ్రిని కొట్టిన విలన్ తాట తీస్తాడు. దీంతో విలన్, అతడి గ్యాంగ్ హీరోను టార్గెట్ చేసి.. తమ సత్తా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో హీరో వారిని ఎలా ఎదుర్కొన్నాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది ఈ కథ.
గోపీచంద్ నుంచి ఆశించే మాస్, యాక్షన్ అంశాలకు లోటు లేని సినిమాలా కనిపిస్తోందిది. ట్రైలర్ నిండా మాస్‌ను ఆకర్షించే అంశాలే కనిపించాయి. కాకపోతే ఈ తరహా సినిమాలు ఇప్పటికే బోలెడన్ని చూశాం. కొత్తదనం అంటూ ఏమీ కనిపించలేదు. చాలా ఏళ్ల కిందట తెరకెక్కిన సినిమా కావడంతో కథాకథనాలే కాదు.. ఆర్టిస్టుల లుక్స్ సైతం పాతగా అనిపిస్తున్నాయి. మరి ఈ ‘పాత’ సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు ఏమేర రుచిస్తుందో చూడాలి. వక్కంతం వంశీ కథతో బి.గోపాల్ రూపొందించిన ఈ చిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్నందించాడు.
This post was last modified on October 4, 2021 1:56 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…