మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తరువాత తేజు షాక్ లోకి వెళ్లిపోవడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంలో హాస్పిటల్ వర్గాలు, మెగాఫ్యామిలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా నాగబాబు త్వరలోనే తేజ్ మన ముందుకు వస్తాడని చెప్పగా.. ‘కొండపొలం’ సినిమా ప్రమోషన్స్ లో వైష్ణవ్ తేజ్ కూడా తన అన్నయ్య ఆరోగ్యంపై స్పందించాడు.
అయితే ఇప్పుడు ఏకంగా సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. ”నా మీద, ‘రిపబ్లిక్’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి థాంక్స్ చెప్పడమనేది చాలా చిన్న పదం. త్వరలోనే మీ ముందుకొస్తా” అంటూ ట్వీట్ చేశారు ధరమ్ తేజ్. అలానే థంబ్సప్ సింబల్ చూపిస్తూ ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
‘అన్నా వచ్చేశావా..? నీరాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వీడియో బైట్ పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే ఈ మెగాహీరో నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నిజాయితీ గల సినిమా తీశారంటూ దర్శకుడ్ని, సాయి ధరమ్ తేజ్ ని పొగిడారు.
This post was last modified on October 3, 2021 6:24 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…