ప్రస్తుతం ఇండియాలో అత్యధిక అంచనాలున్న సినిమా అంటే ఆర్ఆర్ఆర్‌యే. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా కావడమే ఆ అంచనాలకు కారణం. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం కేవలం ప్రేక్షకులే కాదు.. వివిధ ఇండస్ట్రీల జనాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని బట్టి మిగతా చిత్రాల రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబరు 13న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నపుడు అదే తేదీకి మైదాన్ సినిమా షెడ్యూల్ అయి ఉండటంతో దాని నిర్మాత బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఐతే కరోనా కారణంగా ఆ తేదీకి రెండు చిత్రాలూ విడుదల కాలేదు కాబట్టి ఇబ్బంది లేకపోయింది.
ఐతే ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌కు ప్రకటించిన కొత్త తేదీ విషయంలోనూ అభ్యంతరాలు తప్పేలా లేవు. కొన్ని రోజుల కిందటే హిందీ చిత్రం గంగూబాయి కతియావాడీని 2022 జనవరి 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అది ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా. సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. దానికి రిలీజ్ డేట్ ఇచ్చిన కొన్ని రోజులకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ను జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులోనూ ఆలియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌పై హిందీ మార్కెట్లోనూ భారీ అంచనాలున్న నేపథ్యంలో గంగూబాయి చిత్రానికి ఇబ్బందులు తప్పవు.
ఐతే ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది ఆ సినిమానే కాబట్టి.. ఇలా తమపైకి పోటీకి రావడం ఎంత వరకు న్యాయమన్న ప్రశ్న ఆ యూనిట్ నుంచి తలెత్తొచ్చు. ఇది ఆలియాకు కూడా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ వేసవికి బెర్తులు ఫుల్ అయిపోయాయి. సంక్రాంతి సమయంలోనూ ఖాళీ లేదు. దీంతో అన్నీ చూసుకుని జనవరి 7న రిలీజ్ డేట్‌గా ఎంచుకుంది ఆర్ఆర్ఆర్ టీం. కాబట్టి గంగూబాయి చిత్రాన్నే వాయిదా వేస్తారా.. లేక ఆర్ఆర్ఆర్ మీద పోటీకి నిలబెడతారా అన్నది చూడాలి.
This post was last modified on October 2, 2021 8:54 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…