బ‌న్నీ ని ఫాలో అవుతున్న మహేష్

స‌క్సెస్‌ని ఫాలో అవ్వ‌డమే స‌క్సెస్ మంత్రం. చిత్ర‌సీమ న‌మ్మేది అదే. చేతిలో హిట్స్ ఉన్న వాళ్ల‌తోనే ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తారు హీరోలు. మ‌హేష్‌బాబు అందుకు అతీతుడేమీ కాదు.

ఓర‌కంగా చెప్పాలంటే.. అంద‌రి కంటే ఎక్కువ‌గా స‌క్సెస్‌ల చుట్టూ తిరిగేది మ‌హేష్‌నే. విచిత్రం ఏమిటంటే.. మ‌హేష్ స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడినే కాదు, స‌క్సెస్ ఫుల్ టీమ్ మొత్తాన్ని తెచ్చుకుంటాడు. ‘స‌ర్కారు వారి పాట‌’ టీమ్ చూస్తే ఆ విష‌యం అర్థ‌మైపోతుంది.

‘అల వైకుంఠ‌పుర‌ములో’ `టీమ్ లో స‌గం మంది ‘స‌ర్కారు వారి పాట‌’లో క‌నిపిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌, క‌ళా ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్‌, కెమెరామెన్ వినోద్‌.. వీళ్లంత ‘అల వైకుంఠ‌పుర‌ములో’ టీమే. ఈ సినిమాలో క‌థానాయిక‌గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమె కూడా ఖాయ‌మైపోతే, ద‌ర్శ‌కుడు – బ్యాన‌ర్ త‌ప్ప దాదాపుగా కీల‌క‌మైన వాళ్లంతా ‘వైకుంఠ‌పుర‌ములో’ నుంచి తెచ్చుకున్న వాళ్లే అవుతారు.

ప్ర‌తినాయ‌కుడిగా ఉపేంద్ర పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఆయ‌న్నీ తెచ్చుకుంటే.. ఇది మొత్తం బ‌న్నీ టీమ్ అవుతుంది. ఎలాగంటారా? ఉపేంద్ర విల‌న్‌గా ఎంట‌ర్ అయ్యిందే బ‌న్నీ సినిమా ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’తో క‌దా?