సినీ నటులకు రాజకీయ భావజాలం ఉండటం.. రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగి ఉండటం.. నచ్చిన పార్టీకి మద్దతు పలకడం.. ప్రచారం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇలా ఎప్పట్నుంచో జరుగుతున్నదే. రాజకీయ పార్టీలు పెట్టి సీఎంలు అయిన వాళ్లను చూశాం. ఆ లక్ష్యంతో రాజకీయాల్లో ఇప్పుడు కూడా కొందరు నటులున్నారు. ఐతే రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలుస్తూ.. తోటి సినీ నటుల్ని ఇష్టానుసారం తూలనాడటం.. వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకొచ్చి దూషించడం మాత్రం తప్పు.
సీనియర్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి సరిగ్గా ఇదే పని చేశారు. ఆయన గత ఎన్నికల ముందు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈయన ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత టీడీపీ మద్దతుదారుగా ఉన్నారు. చివరికిప్పుడు వైకాపా పంచన చేరారు.
ఆ పార్టీగా మద్దతుగా ఏం చేసినా, ఏం మాట్లాడినా చెల్లింది కానీ.. పవన్ కళ్యాన్ మీద వరుసగా రెండో రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన భార్య, బిడ్డల ప్రస్తావన తెచ్చి తీవ్ర స్థాయిలో దూషించడం మాత్రం దారుణం అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పైకి అన్నా అనకపోయినా ఇండస్ట్రీలో అన్ని వర్గాల నుంచి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో పోసాని మీద నిషేధం విధించడం గురించి ఇండస్ట్రీ పెద్దల్లో చర్చ జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే అలా చేస్తే అదో పెద్ద వివాదంగా మారొచ్చు. దీని వల్ల పవన్ డిఫెన్స్‌లో పడొచ్చు. పోసాని ఇంకా తీవ్ర స్థాయిలో ఆయన్ని ఎటాక్ చేయొచ్చు. కాబట్టి ఇది సరైన నిర్ణయం అనిపించుకోకపోవచ్చని అంటున్నారు.
దీని కంటే పోసానిని అనధికారికంగా బహిష్కరించడం కరెక్ట్ అన్న చర్చ ఇండస్ట్రీ జనాల్లో నడుస్తున్నట్లు సమాచారం. పవన్ మీద చేసిన వ్యాఖ్యలతో చాలామంది నిర్మాతలు, దర్శకులు హర్టయిన వాళ్లే. ఆయన పేరెత్తితే ఇప్పుడందరూ మండిపోతున్నారు. వీళ్లలో ఎవ్వరూ కూడా ఇకపై పోసానికి ఛాన్సులు ఇచ్చే అవకాశాలు లేదని.. ఈ విషయంలో ఒక మాట అనుకుని అనధికారికంగా పోసానిని పక్కన పెడితే ఆయనకి తగిన శిక్ష పడ్డట్లే అని.. ఇది ఒక్కసారిగా జరిగే పని కాదు కాబట్టి దీనిపై పోసాని పెద్దగా మాట్లాడ్డానికి కూడా వీలుండదని ఇండస్ట్రీ పెద్దలు అనుకుంటున్నట్లు సమాచారం.
This post was last modified on October 2, 2021 6:20 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…