సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా.. దానికి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. టీజర్ లో మహేష్ చాలా క్లాస్ లుక్ తో కనిపించారు. అలా అని సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఉండేవేమో అనుకుంటే పొరపాటే. దర్శకుడు పరశురామ్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. మాస్ ఆడియన్స్ కి తగ్గట్లుగానే కొన్ని సీన్లు డిజైన్ చేసుకుంటున్నాడట.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాస్ కి నచ్చేలా.. చాలా ఎనర్జిటిక్ గా డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. వైజాగ్ లో సింహాచలం దేవాలయం నేపథ్యంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. అలానే పతాక సన్నివేశాలు కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ లో అయితే విలన్ సముద్రఖనికి మహేష్ బాబు వరహావతారంలో కనిపిస్తారట. ఆ సీన్ తో విశ్రాంతి కార్డ్ పడబోతుంది.
అయితే ఇప్పటివరకు మహేష్ బాబు పౌరాణిక గెటప్ లో కనిపించిందిలేదు. ఆ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా ఆయన ఒప్పుకోరు. ఆ గెటప్ మహేష్ కి ఎంతవరకు సూట్ అవుతుందనే విషయంలో సందేహాలు ఉన్నాయి. అందుకే పరశురామ్ ఈ సీన్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడట. ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రాకపోతే గనుక సినిమా సంక్రాంతికి రావడం పక్కా. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on October 2, 2021 4:18 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…