సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య నటించిన ఓ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజవుతుందని రెండేళ్ల ముందు అంటే అందరూ నవ్వే వాళ్లేమో. కానీ గత ఏడాది కరోనా పుణ్యమా అని సూర్య సినిమా సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఆ సమయానికి సౌత్ ఇండియాలో ఓటీటీ ద్వారా రిలీజైన అతి పెద్ద సినిమా అదే.
ఈ సినిమాను ఇలా రిలీజ్ చేయడం పట్ల తమిళ ఎగ్జిబిటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా సూర్య తగ్గలేదు. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడి థియేటర్లలోనే కొత్త చిత్రాలు రిలీజవుతున్నప్పటికీ.. ప్రైమ్‌లో వరుసగా సినిమాలు రిలీజ్ చేయడానికి డీల్ కుదుర్చుకుని తన ప్రొడక్షన్ నుంచి ఒక్కో చిత్రం వదులుతున్నాడు సూర్య.
అతడి నిర్మాణంలో తెరకెక్కిన రారా అనే చిన్న సినిమాను ఇటీవలే ప్రైమ్‌లో రిలీజ్ చేశాడు సూర్య. దీని తర్వాత తాను హీరోగా నటించిన సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు.
జై భీమ్ పేరుతో సూర్య హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇదొక హార్డ్ హిట్టింగ్ డ్రామా అనే విషయం దీని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమైంది.
అమేజాన్ ప్రైమ్‌తో ఒకేసారి నాలుగు సినిమాలకు డీల్ చేసుకున్న సూర్య… ఇందులో భాగంగా రెండో చిత్రంగా జై భీమ్‌ను ఈ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాడు. అక్టోబరు 2న ఈ చిత్రం రిలీజవుతుందని సూర్య స్వయంగా ప్రకటించాడు.
జ్ఞానవేల్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్య, జ్యోతిక కలిసి జై భీమ్‌ను నిర్మించారు. తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. సూరారై పొట్రుతో అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సూర్య.. ఈ చిత్రంతో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి మరి.
This post was last modified on October 1, 2021 9:00 pm
విభజన హామీల అమలు.. సమస్యల పరిష్కారంపై మరోసారి కేంద్ర ప్రభుత్వం బంతాట ప్రారంభించింది. మీరే తేల్చుకోండి! అని తేల్చి చెప్పింది.…
మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి.. ఏపీ విధ్వంసకారి అంటూ వైసీపీ అధినేత జగన్…
అధికార పక్షం ముందు ప్రతిపక్షం బింకంగానే ఉంటుంది. అది కేంద్రమైనా.. రాష్ట్రమైనా.. ఒక్కటే రాజకీయం. మంచి చేసినా.. చెడు చేసినా..…
చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి… ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం జమ్లమడుగు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేత. ఆదిలో కాంగ్రెస్, వైసీపీల్లో…
మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…
సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్ కోసం టాలీవుడ్ బాగానే…