మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘గని’. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఏదొక సమస్య వస్తూనే ఉంది. మొదట జూలై 2020లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కానరంగా ఏడాది వాయిదా వేసి 2021, జూలై 31న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ డేట్ న కూడా సినిమా రాలేదు. రీసెంట్ గా దీపావళి బరిలో సినిమా నిలుస్తుందని చిత్రబృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు దీపావళికి కూడా సినిమా రావడం లేదని సమాచారం.
బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి లాంటి నటులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ టాలీవుడ్ కి పరిచయం కానుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఔట్ ఫుట్ విషయంలో వరుణ్ తేజ్ సంతృప్తిగా లేడని రూమర్లు వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు ఈ వార్తలకు కొట్టిపారేశారు.
ఇప్పుడు ఈ సినిమాను ఎందుకు వాయిదా వేస్తున్నారనే విషయంలో మాత్రం మేకర్లు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ తన శరీరాకృతిని మార్చుకున్నారు. బాక్సింగ్ లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ ‘ఎఫ్3’ సినిమాలో కూడా నటిస్తున్నారు.
This post was last modified on October 1, 2021 12:22 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…