స్టార్ స్టేటస్ సంపాదించిన ఒక హీరోకు ఒక కొడుకు ఉంటే ఆటోమేటిగ్గా హీరో అయిపోతాడంతే. శోభన్ బాబు లాంటి చాలా కొద్దిమంది మాత్రమే వారసులను సినీ రంగంలోకి తీసుకురాకుండా ఆపేశారు కానీ.. ఈ కాలంలో మాత్రం అలా నియంత్రించుకునే వాళ్లు దాదాపు కనిపించరు. సీనియర్ నటుడు శ్రీకాంత్ సైతం తన కొడుకు రోషన్‌న సినిమాల బాటే పట్టించారు. శ్రీకాంత్ భార్య ఊహ కూడా ఒకప్పటి కథానాయికే కాబట్టి రోషన్‌కు చిన్నపుడే సినిమాల మీద ఆసక్తి పుట్టి ఉంటుంది. అతణ్ని ఆపి ఉండరు.
రోషన్ టీనేజీలో ఉండగానే ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఐతే రోషన్ బాగా చేసినప్పటికీ ఆ సినిమా అయితే ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో రోషన్ తొలి అడుగు తడబడింది. దీంతో వెంటనే ఇంకో సినిమా చేయకుండా బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘పెళ్ళి సంద-డి’ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు రోషన్.
మరి ‘నిర్మలా కాన్వెంట్’ రిలీజయ్యాక.. ‘పెళ్ళిసంద-డి’ చేయడానికి మధ్యలో ఐదేళ్ల పాటు రోషన్ ఏం చేశాడన్నది ఆసక్తికరం. ఈ టైంలో రెగ్యులర్ స్టడీస్ పూర్తి చేయడంతో పాటు యాక్టింగ్‌లో డిప్లమా చేశాడట రోషన్. అంతే కాదు.. ప్రభుదేవా దగ్గర అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడట. నటుడు కావాలనుకున్నప్పటికీ.. సినిమాకు సంబంధించి అన్ని విభాగాల మీదా అవగాహన రావాలన్న ఉద్దేశంతో ప్రభుదేవా దగ్గర చేరాడని.. అతను హిందీలో తెరకెక్కించిన ‘దబంగ్-3’ సినిమాకు పూర్తిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడని శ్రీకాంత్ వెల్లడించాడు.
నిజానికి రోషన్‌ను హీరోగా పరిచయం చేయడానికి ఇంకో రెండు మూడేళ్లు ఆగాలని తాను అనుకున్నానని.. కానీ రాఘవేంద్రరావు అడగడంతో తనతో ‘పెళ్లిసంద-డి’ చేయించడానికి ఒప్పుకున్నానని శ్రీకాంత్ తెలిపాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి అనే కొత్త దర్శకురాలు రూపొందించిన ‘పెళ్ళిసంద-డి’ దసరా కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 1, 2021 12:14 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…