సినీ రంగంలో ఎలాంటి కథానాయిక అయినా ఏదో ఒక దశలో గ్లామర్ రూట్లోకి రావాల్సిందే. చాలా ట్రెడిషనల్‌గా కనిపించే హీరోయిన్లు కూడా కొన్ని సినిమాల్లో చాలా సెక్సీగా కనిపించిన సందర్భాలున్నాయి. ఈ తరంలో సాయిపల్లవి లాంటి అరుదైన హీరోయిన్లకు మాత్రమే ఆ రూట్లోకి వెళ్లాల్సిన అవసరం పడలేదు. ఒకప్పుడు చాలా ట్రెడిషనల్‌గా కనిపించిన ఈషా రెబ్బా ఇప్పుడు ఎంత హాట్‌గా తయారైందో తెలిసిందే.
‘అందాల రాక్షసి’ సినిమాలో సంప్రదాయ తెలుగమ్మాయిలా కనిపించి కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టిన లావణ్య త్రిపాఠి తర్వాత చేసిన సినిమాల్లో చాలా వరకు పద్ధతిగానే కనిపించింది. కొంచెం సెక్సీగా కనిపించే ప్రయత్నం చేసింది కానీ హద్దులు దాటి అందాల ప్రదర్శన మాత్రం ఎప్పుడూ చేయలేదు. సినిమా అవకాశాలు తగ్గాక కూడా ఆమె ఏమీ రూట్ మార్చలేదు.
ఫొటో షూట్లు చేసినా మరీ హాట్‌గా ఏమీ కనిపించేది కాదు. కానీ తాజాగా ఆమె తన చుట్టూ గీసుకున్న నియంత్రణ రేఖను దాటేసింది. మునుపెన్నడూ లేనంత హాట్ హాట్‌గా కనిపిస్తూ ఒక ఫొటో షూట్ చేసింది. ఈ షూట్ ఒక కారు లోపల జరగడం విశేషం. లింగరీలో క్లీవేజ్ షో చేస్తూ.. హాట్ లుక్స్‌తో కుర్రాళ్లకు వలపు బాణాలు విసిరింది లావణ్య. ఈ పొటోలు చూసి లావణ్య నుంచి ఇంత హాట్‌నెస్సా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ ఫొటోలు వెంటనే వైరల్ అయిపోయాయి.
లావణ్యకు మంచి హిట్ పడి చాలా కాలమే అయింది. ఈ ఏడాది ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో పలకరించిన ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతానికి తన చేతిలో సినిమాలేవీ లేనట్లే ఉన్నాయి. ఈ హాట్ ఫొటో షూట్లయినా ఛాన్సులు తెచ్చిపెడతాయేమో చూద్దాం మరి.
This post was last modified on October 1, 2021 12:07 pm
టీడీపీలో ఇప్పుడు ఒక పేరు తరచూ వినిపిస్తోంది. ఆ పేరు 2014లో పార్టీ విజయం సాధించినప్పుడూ వినిపించింది.. ఇప్పుడు 2024…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…
వచ్చే ఏడాది ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న ఘాటీ అనుష్క అభిమానులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పెర్ఫార్మన్స్ ఆధారంగా టైటిల్…
కామెడీ, కమర్షియల్, యాక్షన్ ఈ మూడు అంశాలను సరైన పాళ్లల్లో కలిపి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో అనిల్ రావిపూడి శైలే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ కి ఇచ్చిన భారీ టికెట్ రేట్ల వెసులుబాట్లు ఈ రోజుతో…