ఈ రోజుల్లో సామాజిక అంశాల మీద సీరియస్ సినిమాలు తీసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం, వాళ్లను రంజింపజేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఈ తరహాలో సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా ఆశించిన వసూళ్లు రావు. ఇందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. అయినా సరే.. రాజకీయ, సామాజిక అంశాల నేపథ్యంలో సమాజానికి అవసరమైన ఒక బలమైన కథను ఎంచుకుని ‘రిపబ్లిక్’ సినిమా తీశాడు దేవా కట్టా.
ఇలాంటి కథల్లో నటించడానికి యువ కథానాయకులు భయపడతారు కానీ.. మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ రిస్క్ చేశాడు. దేవా కెరీర్లో బెస్ట్ ఫిలింగా పేరున్న ‘ప్రస్థానం’ సినిమాకు కూడా అప్పట్లో ఆశించిన వసూళ్లు రాకపోవడం గమనార్హం. కేవలం గొప్ప సినిమా అనే పేరు మాత్రమే మిగిలింది దానికి. కానీ ఆ తర్వాత వేరే స్టయిల్లో సినిమాలు తీసి చేదు అనుభవాలు ఎదుర్కొన్న దేవా.. ఇప్పుడు మళ్లీ తన శైలిలో ‘రిపబ్లిక్’ తీశాడు.
ట్రైలర్ చూస్తే సమకాలీన రాజకీయ, సామాజిక పరిస్థితులపై విసిరిన వ్యంగ్యాస్త్రంలా కనిపిస్తోందీ చిత్రం. ట్రైలర్ సహా ఈ సినిమా ప్రోమోలన్నీ చాలా ఇంటెన్స్‌గా కనిపించాయి. దేవా మార్కు డైలాగ్స్ ఆకర్షణలా కనిపించాయి. సినీ, మీడియా ప్రముఖులకు వేసిన స్పెషల్ షోలో సినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. చిత్ర బృందం పెట్టిన సిన్సియర్ ఎఫర్ట్‌కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకం. గత వారం వచ్చిన ‘లవ్ స్టోరి’ వీకెండ్ తర్వాత అంతగా జోరు చూపించలేకపోయింది. ఐతే వీకెండ్లో ఆ సినిమా మళ్లీ పుంజుకునే అవకాశముంది. దాన్నుంచి పోటీని తట్టుకుని ప్రేక్షకులను ఆకర్షించాలంటే ‘రిపబ్లిక్’కు మంచి టాక్ రావాలి.
‘రిపబ్లిక్’ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడం వల్ల ఈ సినిమాను ప్రమోట్ చేయలేకపోయాడు. అతను ప్రమోషన్లకు రాకపోవడం మైనస్సే అయినా.. తన పట్ల సానుభూతి కొంత మేర సినిమాకు ఉపయోగపడొచ్చు. మరి ‘రిపబ్లిక్’కు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఫలితం వస్తుందో చూడాలి.
This post was last modified on October 1, 2021 10:17 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…