బాలీవుడ్‌లో భారీ చిత్రాలకే కాదు.. కాంట్రవర్శీలకి కూడా కేరాఫ్‌గా నిలుస్తాయి సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు. గుజారిష్, రామ్‌లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావతి లాంటి చిత్రాల్లో కంటెంట్ పరంగా కొందరు అభ్యంతరాలు చెప్పడంతో ఆ సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. కొన్ని వాటి నుంచి బైటపడ్డాయి. కొన్ని మాత్రం కోతకి గురయ్యాకే బైటికొచ్చాయి. రీసెంట్ మూవీ ‘గంగూబాయ్ కథియావాడి’ విషయంలోనూ వివాదం చెలరేగింది.
ప్రపంచంలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాస్‌లో ముంబైలోని కామాఠిపుర ఒకటి. ఇక్కడ ఒకప్పుడు గంగూబాయ్ అనే ఆమె ఉండేది. ఓ సాధారణ సెక్స్ వర్కర్‌గా అక్కడికి వచ్చిన గంగూబాయ్.. తర్వాత ఆ ఏరియా మొత్తమ్మీద పట్టు సాధించింది. లోకల్ లీడర్స్‌ని, బడా బిజినెస్ మ్యాగ్నెట్స్‌ని కూడా హడలెత్తించింది. రాజకీయాల్లోకి సైతం వచ్చింది. ఓ సమయంలో సెక్స్ వర్కర్స్ సంక్షేమానికి కూడా పాటు పడింది. ఆమె జీవితాన్నే సినిమాగా తీశాడు భన్సాలీ. ఆలియా భట్ టైటిల్ రోల్‌లో నటించింది.
ఈ సినిమా ఎప్పుడో రిలీజవ్వాలి. కానీ షూటింగ్‌తో పాటు విడుదలకు కూడా కరోనా, లాక్ డౌన్ అడ్డుపడటంతో బాగా లేటయ్యింది. దాంతోపాటు కేసులు కూడా చుట్టుముట్టాయి. తన తల్లి జీవితాన్ని తప్పుగా తీస్తున్నారని, ఆమెని అవమానిస్తే సహించలేది లేదని, వెంటనే ఈ సినిమాని ఆపేయాలని కోరుతూ గంగూబాయ్ కొడుకు కోర్టుకెక్కాడు. భన్సాలీతో పాటు ఆలియా మీద కూడా కేసులు వేశాడు. దాంతో కొన్ని రోజుల పాటు హై టెన్షన్ నడిచింది. కానీ చివరికి కోర్టు కేసులు కొట్టేయడంతో గంగూబాయ్‌కి లైన్ క్లియర్ అయ్యింది. థియేటర్లు కూడా తెరుచుకుంటున్నాయి కనుక, వచ్చేయేడు జనవరి 6న ‘గంగూబాయ్ కథియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్లు భన్సాలీ ప్రకటించాడు.
This post was last modified on September 30, 2021 7:10 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…