సౌత్ సూపర్ హిట్స్ని రీమేక్ చేయడానికి బాలీవుడ్ వారు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే చాలా సినిమాలు అక్కడ రీమేక్ అయ్యాయి. ఇంకా అవుతున్నాయి. ముఖ్యంగా రీమేక్స్ లో హిట్టు కొట్టడం ఎలాగో అక్షయ్ కుమార్ ని చూసి తెలుసుకోవాలి. తను నటించిన హాలీడే, బాస్, రౌడీ రాథోడ్, ఖట్టా మీఠా, ఖంబక్త్ ఇష్క్, గరం మసాలా, భూల్ భులయ్యా, హేరాఫేరీ తదితర చిత్రాలన్నీ సౌత్ సినిమాలకు రీమేక్సే.
ఇప్పుడు మరో రీమేక్కి రెడీ అయ్యాడు అక్షయ్. మలయాళ సూపర్ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్‌లో నటించబోతున్నాడు. ఒక స్టార్ హీరోకి, అతని అభిమానికి మధ్య ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను ఎలా మార్చేసింది అనేది కథ. పృథ్విరాజ్ సుకుమార్ స్టార్ హీరో పాత్రలో నటిస్తే, అతని అభిమాని అయిన ఆర్టీవో ఆఫీసర్ పాత్రని సూరజ్ వెంజరమూడు చేశాడు. హిందీలో పృథ్వి క్యారెక్టర్లో అక్కీ, సూరజ్ పాత్రలో ఇమ్రాన్ హష్మి కనిపించనున్నారు. రాజ్ మెహతా దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడు.
నిజానికి ఈ మూవీ తెలుగులోనూ రీమేక్ అవుతోందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా బాబి తీయబోయే సినిమా అదేనని టాక్. ఇప్పటికే లూసిఫర్, వేదాళం సినిమాల రీమేక్ లో నటిస్తున్న మెగాస్టార్, ‘డ్రైవింగ్ లైసెన్స్’ కాన్సెప్ట్ను కూడా ఇష్టపడ్డారని, ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా బాబి స్క్రిప్ట్ తయారు చేశాడని, త్వరలోనే సినిమా సెట్స్ కి వెళ్తుందని అంటున్నారు. మొత్తానికి పృథ్వీరాజ్ సినిమాలకి మిగతా భాషల్లో డిమాండ్ బాగా పెరిగింది. ‘లూసిఫర్’ని అతడే డైరెక్ట్ చేశాడు. ఓ పాత్రలో నటించారు కూడా. ఇక పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ఒరిజినల్ వెర్షన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా పృథ్వి నటించిన సినిమానే!
This post was last modified on September 30, 2021 11:01 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…