Movie News

పోసాని.. ఇదేం లాజిక్ అయ్యా?

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారు పోసాని కృష్ణమురళి మంగళవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌‌లో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది. ముందు రోజు పవన్ మీద విమర్శలు చేయడానికి పోసాని తొలి ప్రెస్ మీట్ పెట్టినపుడు ఆయన చాలా కూల్‌గా కనిపించారు. చాలా సరదాగా మాట్లాడారు. పవన్ మీద రాజకీయ పరమైన విమర్శలు చేశారు. ఇలాంటి విమర్శలు ఎవరైనా చేసేవే.

విమర్శల్లో ఎంత విషయం ఉందన్నది పక్కన పెడితే.. ఒక పార్టీ మద్దతుదారుగా మరో పార్టీ అధినేతపై రాజకీయ పరమైన విమర్శలు చేయడంలో తప్పేమీ లేదు. ఐతే నిన్నటి ప్రెస్ మీట్లో మాత్రం పోసాని పూర్తిగా అదుపు తప్పారు. మొన్నటి విమర్శల విషయంలో పోసానికి మద్దతిచ్చిన వాళ్లు, ఆయన్ని వెనకేసుకువచ్చిన వాళ్లు కూడా తాజా వ్యాఖ్యలతో విస్మయానికి గురయ్యారు. పూర్తిగా వ్యక్తిగత విషయాల్లోకి దిగిపోయి ఆయన చేసిన దిగజారుడు వ్యాఖ్యల పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆక్రోశం వ్యక్తమవుతోంది. వైకాపా వాళ్లు కూడా పోసానిని ఎలా డిఫెండ్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

మొన్నటి విమర్శల నేపథ్యంలో పవన్ అభిమానులు తన భార్యకు ఫోన్ చేసి బూతులు తిట్టారని, మానసికంగా వేధించారని.. తాను విమర్శలు చేస్తే తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తూ పోసాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలో పవన్‌ను సైకో, లుచ్చా, లోఫర్ అంటూ దారుణమైన బూతుతు తిట్టారు. ఇక్కడి వరకు కూడా ఓకే కానీ.. ‘‘నీకూ ఒక కూతురుంది. తను పెద్దదవుతుంది. అప్పటికి నేను బతికే ఉంటా. రక్త కన్నీరు కారుస్తావు’’ అంటూ పోసాని చేసిన హెచ్చరికే దారుణాతి దారుణం.

అంతటితో ఆగారా లేదు. ‘‘పవన్ నువ్వు షూటింగ్‌లకు వెళ్లినపుడు నీ భార్య పనివాళ్లతో పడుకుందని విన్నా. నీ పిల్లలు నీకు పుట్టలేదని.. పని వాళ్లకు పుట్టారని అనుకుంటున్నారు. ఏమంటావ్’’ అంటూ నీచమైన మరో కామెంట్ కూడా చేశారు. పవన్ అభిమానుల తీరుతో పోసాని ఎంతగా హర్టయి ఉన్నా ప్రెస్ మీట్ పెట్టి తన స్థాయి వ్యక్తి ఇంత చీప్ కామెంట్లు చేయడం ఎంత వరకు సమంజసం? ఇదంతా పక్కన పెడితే ఎవరో ఊరూ పేరూ లేని పవన్ అభిమానులు పోసానికి, ఆయన భార్యకు ఫోన్ చేసి తిడితే.. పోసాని తన సహ నటుడిని, ఒక రాజకీయ పార్టీ అధినేతను పట్టుకుని అన్నేసి మాటలు అనడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు.

పవన్‌ ఒక పెద్ద సినిమా స్టార్. అందరు హీరోల్లాగే అతడికీ లక్షలమంది అభిమానులున్నారు. వాళ్లలో ప్రతి ఒక్కరినీ పవన్ ఎలా అదుపు చేయగలడు? తనకు ఫోన్ చేసి బూతులు తిట్టినపుడు ఆ వ్యక్తుల ఫోన్ నంబర్లుంటాయి కాబట్టి వాటి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం పోసానికి ఉంది. లేదా పవన్ నీ అభిమానులను కంట్రోల్ చెయ్యమంటూ పవన్‌ను డిమాండ్ చేయొచ్చు. లేదా ఆ ఫోన్ చేసిన అభిమానులను తిట్టొచ్చు. పవన్ ఫ్యాన్స్ ఇలా చేశారు అంటూ మీడియా ముందు లేవదీసి పవన్‌ను ఇరుకున పెట్టొచ్చు. ఇవన్నీ కాకుండా ఆయన పవన్‌ను టార్గెట్ చేస్తూ అతడి భార్య, బిడ్డల మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు?

This post was last modified on September 29, 2021 12:17 pm

Share
Show comments

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

46 minutes ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

2 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

3 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

6 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

6 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

6 hours ago