మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఊటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీని తరువాత మెహర్ రమేష్ తో ఓ సినిమా, అలానే కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరు.
బాబీ-చిరు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని టాక్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో కనిపించబోతున్నాడట. కథ పరంగా సినిమాకి మరో హీరో అవసరం రావడంతో దర్శకుడు బాబీ.. రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది.
గతంలో చిరంజీవి-రవితేజ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమాలో నటించారు. ఆ తరువాత చిరు నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో రవితేజ క్యామియో రోల్ లో కనిపించరు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కించనున్న ఈ సినిమాను అక్టోబర్ లో లాంచ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు దర్శకుడు. మరి హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో..!
This post was last modified on September 29, 2021 12:06 pm
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…