ఒకదాని తర్వాత ఒకటిగా క్రేజీ ప్రాజెక్ట్ ను తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్నారు తమన్. ఇప్పటికే అఖండ, గని, సర్కారు వారి పాట, థాంక్యూ, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్, చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో చోటు సంపాదించారు. విజయ్ తొలి తెలుగు చిత్రానికి తమన్ వర్క్ చేయబోతున్నారు.
విజిల్, మాస్టర్ చిత్రాలతో తెలుగునాట తన మార్కెట్‌ను బాగా పెంచేసుకున్నాడు విజయ్. దాంతో నేరుగా టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌ని తీసుకున్నట్లు తాజాగా ప్రకటించారు.
అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టే తమన్, ట్యూన్స్ పరంగా ఇంకాస్త బెటర్ అవ్వాలనే కామెంట్ తరచు వినబడుతోంది. చాలాసార్లు తనపై కాపీ మరక కూడా పడింది. దానికి తమన్ కొన్ని సందర్భాల్లో వివరణ ఇచ్చాడు కూడా. ఇన్స్పైర్ అవుతాను తప్ప ఇమిటేట్ చేయనని, కాపీ చేస్తాననడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఏదేమైనా అతని వర్కింగ్ స్టైల్ మాత్రం ఫిల్మ్ మేకర్స్‌ని బాగా ఇంప్రెస్ చేస్తోంది. వేగంగా వర్క్ చేయడం, బడ్జెట్ పరంగా అందుబాటులో ఉండటంతో పాటు.. మోడర్న్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తూ ఉండటం వల్లే తమన్ బ్యాగ్‌లో ఇన్ని బిగ్ ప్రాజెక్ట్స్ పడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates