లైగర్‌‌ కోసం లెజెండ్‌


సినిమా తీయడంలోనే కాదు.. టైటిల్స్ పెట్టడంలోనూ పూరి జగన్నాథ్‌ది ఓ డిఫరెంట్ స్టైల్. విజయ్‌ దేవరకొండతో తీస్తున్న సినిమాకి కూడా అలాంటి టైటిలే పెట్టాడు ‘లైగర్‌‌’ అని. ‘సాలా క్రాస్‌ బ్రీడ్’ అంటూ ట్యాగ్‌ లైన్‌ కూడా వెరైటీగానే ఇచ్చాడు. విజయ్‌ దేవరకొండని బాక్సర్‌‌గా నటిస్తున్న ఈ సినిమాని కరణ్ జోహార్‌‌తో కలిసి పూరి, చార్మి నిర్మిస్తున్నారు.

ప్యాన్ ఇండియా రేంజ్‌లో తీస్తూ ఉండటం, విజయ్‌ దేవరకొండకి బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కావడంతో మేకింగ్ విషయంలో చాలా పర్టిక్యులర్‌‌గా ఉన్నాడు పూరి. ఎక్కడా రాజీ పడటం లేదు. షూట్‌ మొత్తం నార్త్‌లోనే ప్లాన్ చేశాడు. అంతే కాదు.. నటీనటుల్ని కూడా ఏరికోరి ఎంచుకున్నాడు. బాలీవుడ్ నటి అనన్యా పాండేని హీరోయిన్‌గా తీసుకున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్‌ని కీలక పాత్రలకి ఎంచుకున్నాడు. ఇప్పుడు అంతకంటే పెద్ద సర్‌‌ప్రైజ్ ఒకటి ఇచ్చాడు.

ద గ్రేట్ బాక్సింగ్ లెజెండ్ మైక్‌ టైసన్ తమ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఓ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ ఎక్స్‌పర్ట్‌ లైఫ్ చుట్టూ తిరుగుతుంది. అందుకు తగ్గట్టు విజయ్ దేవరకొండ మేకోవర్ అయ్యాడు. బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తనతో సమానంగా ఇంపార్టెన్స్ ఉండే మరో ఫైటర్‌‌ పాత్ర ఇందులో ఉందట. దాని కోసమే టైసన్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర ఏంటి, అది ఎలా ఉండబోతోంది అనేది ఇప్పటికి సస్పెన్స్. ప్రస్తుతం గోవాలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు తీస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు. తమ సినిమా థియేటర్స్‌లోనే రిలీజవువుతుందని కన్‌ఫర్మ్ చేశారు.