బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు ప్రభాస్. వచ్చే సంక్రాంతికి ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ‘ఆదిపురుష్’కి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 11న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
వచ్చే నెల నుంచి మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దాంతో నిర్మాతలంతా పోటీపడి తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఆదివారం ఒకే రోజున పదమూడు సినిమాల విడుదల తేదీలు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాకి కూడా డేట్ డిసైడ్ చేశారు.
అయితే అదేరోజు అక్షయ్ కుమార్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘రక్షాబంధన్’ కూడా రిలీజ్ కానుంది. దీనివల్ల మిగతా చోట్ల సమస్య లేదు కానీ బాలీవుడ్‌లో మాత్రం కాంపిటీషన్ ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే ప్రస్తుతం బీటౌన్‌లో అక్కీ హవానే నడుస్తోంది. అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంటాయి. ఇక ప్రభాస్ మనకి ఎంత పెద్ద స్టార్ అయినా బాలీవుడ్‌లో ప్రస్తుతానికి కొత్తవాడే, పరాయివాడే. కాకపోతే ఇది బాలీవుడ్‌లో తీస్తున్న సినిమా కాబట్టి లెక్కలు మారే అవకాశం ఉంది. అయినా కానీ అక్కీతో ఆదిపురుష్‌కి పోటీ మాత్రం తప్పకుండా ఉంటుంది.
This post was last modified on September 27, 2021 12:54 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…