బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అక్టోబర్ 22 నుంచి థియేటర్లు నడిపేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనుమతులు ఇచ్చారు. దీంతో చాలా కాలంగా విడుదలకు రెడీగా ఉన్న సినిమాలన్నీ క్యూ కట్టాయి.
ఇదే క్రమంలో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు తన సినిమాను వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆమిర్ ఖాన్. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పేశారు. నిజానికి ఆమిర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం అల్లు అర్జున్ కి కలిసొచ్చే విషయమని చెప్పాలి. ఎందుకంటే తొలిసారి ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు బన్నీ.
క్రిస్మస్ కానుకగా ‘పుష్ప’ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన కొద్దిరోజులకే ఆమిర్ ఖాన్ సినిమా క్రిస్మస్ కి వస్తుందని అనౌన్స్ చేశారు. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ సినిమాతో పోటీ పడడమనేది ‘పుష్ప’కి పెద్ద విషయం. దీంతో బన్నీ వెనక్కి తగ్గాల్సి వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఈ పోటీ నుంచి తప్పుకొని బన్నీకి లైన్ క్లియర్ చేసేశారు. మరి ‘పుష్ప’ బాలీవుడ్ లో ఎలాంటి మార్క్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి!
This post was last modified on September 27, 2021 7:12 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…