హీరో సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ అంశాలతో పాటు.. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఏపీలో టికెట్స్ ప్రభుత్వమే అమ్ముతుందనే విషయంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.
ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ధైర్యంగా ఏపీ ప్రభుత్వంలో మాట్లాడాలని సూచించారు. పవన్ తన స్పీచ్ లో ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, మోహన్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోల గురించి మాట్లాడారు. అందరూ ఒక్క మాటపై నిలబడాలని.. ప్రశ్నించడం మన హక్కు అని ప్రోత్సహించారు. ఇదే సమయంలో హీరో నాని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్నిరోజుల క్రితం నాని థియేటర్ల గురించి మాట్లాడితే.. అందరూ ఆ అబ్బాయ్ ని టార్గెట్ చేశారని.. పాపం తనేం చేస్తాడు.. దమ్ముంటే వైసీపీ ప్రభుత్వాన్ని వెళ్లి అడగమంటూ చురకలు అంటించారు పవన్.
తాజాగా పవన్ కళ్యాణ్ స్పీచ్ పై నాని స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సర్ కి ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెడితే.. సినీ పరిశ్రమ గురించి ఆయన జెన్యూన్ గా మాట్లాడారని.. అందరూ దానిపై దృష్టి పెట్టాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు నాని. అలానే.. సినిమా సభ్యుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని. సంబంధిత మంత్రులను సినీ పరిశ్రమను కాపాడమని కోరుతున్నట్లు నాని తన ట్వీట్ లో పేర్కొన్నారు. నాని వేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on September 26, 2021 3:49 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…