ప్రస్తుతం తెలుగు సినిమా సంగీతంలో తమన్‌ది టాప్ ప్లేస్. చాలా ఏళ్లు సాగిన దేవిశ్రీ ప్రసాద్ హవాకు చెక్ పెడుతూ రెండు మూడేళ్లుగా అతను దూసుకెళ్తున్నాడు. అందులోనూ ఈ మధ్య అయితే అతడి ఊపు మామూలుగా లేదు. సంక్రాంతికి నేరుగా దేవిశ్రీ ప్రసాద్‌ను ఢీకొట్టి అతడిపై తిరుగులేని ఆధిపత్యం చలాయించాడు.
తమన్ సంగీతాన్నందించిన అల వైకుంఠపురములో ముందు దేవిశ్రీ మ్యూజిక్ చేసిన సరిలేరు నీకెవ్వరు ఎలా తేలిపోయిందో తెలిసిందే. ఈ దెబ్బతో హీరోలు, దర్శకులు దేవిశ్రీని కాదని తమన్ వైపు చూసే పరిస్థితి వచ్చింది.
ముఖ్యంగా హీరోలే తమన్ కావాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఇంతకముందు దేవి మీద ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించి అతనే కావాలన్న హీరోలు ఒక్కొక్కరుగా తమన్ వైపు మళ్లుతున్నారు.
ఆ జాబితాలో మహేష్ కూడా చేరిపోయాడు. పరశురామ్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాకు మహేష్ ఏరి కోరి తమన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. సరిలేరు ఆడియో గురించి ఆహా ఓహో అంటూ అప్పట్లో పొగిడేసినప్పటికీ.. లోలోన మాత్రం మహేష్ చాలా డిజప్పాయింట్ అయ్యాడని.. వరుసగా దేవితో సినిమాలు చేస్తుండటం పట్ల అభిమానులు అసంతృప్తిని కూడా గుర్తించి తమన్ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ ప్రచారమే నిజమైంది. మధ్యలో పరశురామ్ గోపీసుందర్ పట్ల ఆసక్తి చూపించినా.. మహేష్ మాత్రం తమనే కావాలని అతణ్నే ఓకే చేయించాడు.
ఇలా తన మీద హీరో లేదా దర్శకుడు అభిమానం చూపిస్తే తమన్ మరింతగా రెచ్చిపోతున్నాడు. అదిరిపోయే ఔట్ పుట్ ఇస్తున్నాడు. మరి సర్కారు వారి పాట మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates