పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లో అభిమానులకు ఎక్కువ నచ్చేది ఆయనలోని నిజాయితీతో కూడిన ఆవేశం. పవన్ ప్రజారాజ్యం తరఫున రాజకీయాల్లోకి అడుగు పెట్టినపుడు ఎంత ఆవేశంతో ఉండేవాడో తెలిసిందే. కొన్నిసార్లు ప్రసంగాల్లో పవన్ ఎలా ఊగిపోయాడో గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ నాయకుల పంచెలూడదీసి కొట్టండి అంటూ అప్పట్లో పవన్ చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఐతే ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టకపోవడం, తదనంతర పరిణామాలు పవన్‌లో ఆవేశాన్ని తగ్గించేశాయి.
జనసేన ఆవిర్భవించాక కొన్నిసార్లు ఆవేశం చూపించాడు కానీ.. ఆయన ఆవేశానికి సరైన టైమింగ్ కుదరలేదు. గత ఎన్నికలకు ముందు ఆయన ఎవరిని టార్గెట్ చేయాలో తెలియని అయోమయంలో పడిపోవడంతో.. పవన్ ఆవేశానికి అర్థం లేకుండా పోయింది. తను అప్పటికే మద్దతుగా నిలిచి అధికారంలోకి రావడానికి కారణమైన తెలుగుదేశం పార్టీని మరీ గట్టిగా తిట్టలేడు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని కూడా మరీ ఎక్కువ టార్గెట్ చేయడానికి వీల్లేకపోయింది. ఇక్కడే పవన్ టైమింగ్ మిస్సయింది.
అధికారంలో ఉన్న పార్టీ తప్పులు చేస్తున్నపుడు బలంగా ప్రశ్నించే.. వాళ్లను దీటుగా ఎదుర్కొనే నాయకుడి కోసం జనాలు చూస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఇటీవల ఎంతగా విమర్శలు వస్తున్నాయో తెలిసిందే. కానీ ఆ పార్టీని ఇటు తెలుగుదేశం కానీ.. అటు జనసేన కానీ దీటుగా ఎదుర్కోవట్లేదనే అభిప్రాయం బలంగా ఉంది.
వైసీపీని చూసి భయపడుతున్నారని.. దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారనే ఫీలింగ్‌లో జనాలున్నారు. ఇలాంటి సమయంలోనే జనసేనాని ‘రిపబ్లిక్’ ఆడియో వేడుకలో పేలిపోయే స్పీచ్ ఇచ్చాడు. ఎట్టకేలకు పవన్ జనాల నాడి పట్టుకున్నాడని.. వాళ్ల మూడ్‌ను అర్థం చేసుకున్నాడని ఈ స్పీచ్ చూసిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక నాయకుడు కేవలం ఆవేశపడిపోతే సరిపోదు. దానికి అర్థం ఉండదు. కానీ ఆ ఆవేశానికి ఆలోచన కూడా తోడైతే పంచ్ సరిగ్గా పేలుతుంది. పవన్ లేటెస్ట్ స్పీచ్‌లో అదే కనిపించింది.
ప్రతి విషయంలోనూ పాయింట్ పట్టుకుని, ప్రతి మాటకూ పంచ్ జోడిస్తూ పవన్ చేసిన ప్రసంగం జనసేన అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. అలాగే ఆ పార్టీ మద్దతుదారులు కాకపోయినా, వైసీపీని వ్యతిరేకించే వాళ్లకు కూడా పవన్ స్పీచ్ మంచి కిక్ ఇచ్చింది. పవన్ నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారో అదే చేశాడు పవన్. ఇది పవన్ సినీ అభిమానులకు, రాజకీయ మద్దతుదారులకు ఎంతో జోష్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
నాయకుడు బలంగా నిలబడితే, ప్రత్యర్థుల్ని దీటుగా ఎదుర్కొంటే, దూకుడుగా వ్యవహరిస్తే.. ఆటోమేటిగ్గా క్యాడర్‌లోనూ ఉత్సాహం వస్తుంది. వాళ్లూ దూకుడు చూపిస్తారు. అప్పుడు జనాదరణ కూడా ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అధికార పక్షంపై ఒత్తిడి వస్తుంది. మరి అభిమానులు, కార్యకర్తల ఆకాంక్షలకు తగ్గట్లుగా నిన్న రాత్రి ప్రసంగం చేసిన పవన్.. అదే ఊపును ఇక ముందూ కొనసాగిస్తాడేమో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 11:18 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…