మంచు మోహన్ బాబు ఎక్కడుంటే అక్కడ వాతావరణం వేడెక్కిపోతుంది. కొంచెం ముక్కుసూటిగా.. కాస్త వివాదాస్పదంగా ఆయన చేసే వ్యాఖ్యలు వేడి రాజేస్తుంటాయి. ఇక ఇంటర్వ్యూల్లో ఆయన కూర్చున్నారంటే బాంబులు పేలాల్సిందే. ప్రశ్నలడిగే వాళ్లకు చెమటలు పట్టించేలా ఆయన సమాధానాలుంటాయి.
కొన్నిసార్లు ఎదురు ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూయర్‌ను ఇరుకున పెడుతుంటారు. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో తన ప్రశ్నలతో అందరినీ బెదరగొట్టే రాధాకృష్ణను మోహన్ బాబు ఒక ఆటాడుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. అందుకే మోహన్ బాబును ఇంటర్వ్యూ చేయడానికి చాలామంది భయపడుతుంటారు.
ఐతే ఈ విలక్షణ నటుడితో మంచి స్నేహం ఉన్న సీనియర్ కమెడియన్ ఆలీ ఇప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి రెడీ కావడం విశేషం. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ ఇంటర్వ్యూ కార్యక్రమానికి మోహన్ బాబు విశిష్ఠ అతిథిగా వస్తున్నారు.
ప్రస్తుతం టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్‌లో నంబర్ వన్‌గా ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాంను చెప్పొచ్చు. ఈ కార్యక్రమం 250వ ఎపిసోడ్‌లోకి అడుగు పెడుతుండటం విశేషం. ఈ ప్రత్యేక సందర్భానికి తగ్గట్లు విశిష్ఠ అతిథి ఉండాలన్న ఉద్దేశంతో మోహన్ బాబును తీసుకొచ్చింది ఈటీవీ. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు.
మోహన్ బాబు చాలా ఉత్సాహంగా ‘ఆలీతో సరదాగా’ సెట్లోకి అడుగు పెట్టి ఈ కార్యక్రమం గురించి ఇంట్రో ఇచ్చారు. ఈ ఎపిసోడ్ మీద అంచనాలు పెంచేశారు. కొన్ని వారాల ముందే మోహన్ బాబు తనయుడు విష్ణుతో ఆలీ చేసిన ఇంటర్వ్యూకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో కొన్ని వివాదాస్పద ప్రశ్నలు కూడా అడిగాడు ఆలీ.
అతిథులు హర్టవకుండా తెలివిగా వివాదాస్పద అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం ఆలీ ప్రత్యేకత. తన సీనియారిటీ, అతిథులతో ఉండే సాన్నిహిత్యం కూడా అందుకు కలిసొస్తుంది. మరి మోహన్ బాబుకు ఆయనెలాంటి ప్రశ్నలు సంధిస్తాడు.. ఆయనెలాంటి సమాధానాలిస్తారు అన్నది ఆసక్తికరం. ఐతే ఈ ఎపిసోడ్ త్వరలో అన్నారే తప్ప డేట్ ఇవ్వలేదు.
హిట్టు ఫ్లాపు సంగతి ఎలా ఉన్నా తన సినిమా వస్తోందంటే అభిమానులు, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కలిగేలా చేసే విజయ్…
మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులో మూడు తరాల అక్కినేని హీరోలు…
ఈ శుక్రవారం విడుదల కానున్న ఎపిక్ సినిమా మీద ప్రేక్షకుల్లో ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఇటీవల…
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా…
పెద్ద బడ్జెట్లు ముడిపడిన సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముందు వెనుక పోటీ…
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…