కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్.. అది పూర్తి చేసిన వెంటనే వంశీ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తాడు. ఈ సినిమా కోసం విజయ్ వంద కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని.. నిర్మాత దిల్ రాజు అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కథ కూడా లాక్ అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఇక్కడ విషయమేమిటంటే.. మహేష్ రిజెక్ట్ చేసిన కథనే విజయ్ ఓకే చేశారట. నిజానికి ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. దీంతో వంశీ ఓ కథ రాసుకొని మహేష్ కి వినిపించాడు. ఆ కథ కొంచెం ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాలకు దగ్గరగా ఉండడంతో మహేష్ కి నచ్చలేదట. దీంతో వంశీ పైడిపల్లి ఆ ఫ్లేవర్ రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు.
చెప్పిన సమయానికి వంశీ కథ రెడీ చేయలేకపోవడంతో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. మహేష్ వద్దన్న కథనే విజయ్ కి వినిపించాడు వంశీ పైడిపల్లి. మహేష్ కి అంటే ఆల్రెడీ చేసిన జోనర్ అనిపించొచ్చు కానీ విజయ్ కి ఆ కథ కొత్తగానే అనిపించడంతో ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా సినిమా ఓకే చేసేశాడట. అలా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథ మరో స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది.
This post was last modified on September 21, 2021 2:31 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…