ఆంధ్రప్రదేశ్ జనాల సినిమా పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియా మొత్తంలో అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికే ఏ పెద్ద సినిమా రిలీజైనా బెనిఫిట్ షోలు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ షోల హంగామా నడుస్తుంటుంది. చాలా సినిమాలకు తెల్లవారుజామన షోలు పడుతుంటాయి. వీటికి ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు అమ్మడం కామనే. పెద్ద హీరోల సినిమాలు రిలీజైనపుడు ఈ బెనిఫిట్ షోల హంగామానే వేరుగా ఉంటుంది.
ఐతే కరోనా కారణంగా గత ఏడాదిన్నరలో రిలీజైన పెద్ద సినిమాలే తక్కువ. దీంతో ఈ స్పెషల్ షోల సందడే లేకపోయింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఈ షోలకు అనుమతులు ఆపేసింది. వకీల్ సాబ్‌కు ప్లాన్ చేసిన షోలన్నీ క్యాన్సిల్ అయిపోవడం తెలిసిందే.
ఐతే ఇది తాత్కాలికమే అని.. మళ్లీ బెనిఫిట్ షోల హంగామా త్వరలోనే మొదలవుతుందని ఆశించిన వాళ్లకు పెద్ద షాక్ తగిలింది. ఇకపై ఏపీలో బెనిఫిట్ షోలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో సమావేశమైన సినీ పెద్దల్లో ఒకరైన సి.కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏపీలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఆయన తేల్చేశారు. ఈ షోల టికెట్ల ధరలపై ఏమాత్రం నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వానికి వీటి ద్వారా పన్ను ఆదాయం పెద్దగా లేకపోవడం, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మాయాజాలం నడుస్తుండటంతో ఏపీ సర్కారు ఇకపై బెనిఫిట్ షోలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై ఇండస్ట్రీ జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి. తెలంగాణలో చాలా ఏళ్ల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వట్లేదన్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 21, 2021 8:14 am
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…