కాజల్ ఔట్.. ఇలియానా ఇన్..!

సీనియర్ హీరో నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ‘ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమె ‘రా’ ఏజెంట్ గా కనిపించనుందని.. ఆమె పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె గర్భవతి కావడంతో ఈ ప్రాజెక్ట్ వదులుకుంది ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు కాజల్ స్థానంలో ఇలియానా, త్రిష లాంటి హీరోయిన్లను తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఇలియానా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఇలియానా.. నాగార్జునతో కలిసి నటించలేదు. కాబట్టి తెరపై కాంబినేషన్ కొత్తగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇలియానా కూడా ఛాన్స్ ల కోసం చూస్తుంది గనుక నాగ్ సినిమా ఒప్పుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మేకర్లు ఇలియానాతో పాటు మరికొంతమంది బాలీవుడ్ తారల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.

ఫైనల్ గా నాగార్జున ఎవరికి ఓటేస్తే వాళ్లనే తీసుకుంటారు. ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.