సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. మహేష్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ లాంటి కథ రెడీ చేశారని వార్తలొచ్చాయి. రీసెంట్ గా రాజమౌళి ఈ సినిమా కోసం ఓ ఇంగ్లీష్ నవల హక్కులను కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి ఇప్పటివరకు మహేష్ కి కథ సెట్ చేయలేదట.
నిజానికి రాజమౌళి-మహేష్ బాబుల మధ్య ఇప్పటివరకు కథకు సంబంధించి చర్చలు జరిగాయి. రాజమౌళి రెండు, మూడు లైన్లు మహేష్ కి వినిపించాడు. అయితే అందులో ఏ ఒక్కటీ కూడా మహేష్ ని సంతృప్తిపరచలేకపోయింది. దీంతో మహేష్.. సినిమా చేయడానికి చాలా సమయం ఉందని, ఆలస్యమైనా పర్లేదు టైమ్ తీసుకొని స్టోరీ రెడీ చేయమని రాజమౌళికి చెప్పారట. రచయిత విజయేంద్రప్రసాద్ కొన్నాళ్లుగా ఈ కథపైనే వర్క్ చేస్తున్నారు.
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న మహేష్ బాబు ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తి కావడానికి మరో సంవత్సరం ఈజీగా పడుతుంది. అలా చూసుకుంటే 2022 చివరికి కానీ రాజమౌళి-మహేష్ సినిమా పట్టాలెక్కదు. ఈలోగా.. రాజమౌళి బాలీవుడ్ లో చిన్న సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. ఆ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ సినిమా కథ రెడీ చేస్తే సరిపోతుంది.
This post was last modified on September 20, 2021 12:04 pm
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…