రవితేజ.. రాజమౌళి.. అనుష్క.. వీళ్లందరి కెరీర్లలో ఒక సమమంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్నందుకుంది. తర్వాత తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయి ప్రతి చోటా ఘనవిజయం సాధించింది. తమిళంలో కార్తీ హీరోగా ‘శౌర్యం’ శివ ‘సిరుత్తై’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయగా.. హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రభుదేవా ‘రౌడీ రాథోడ్’ పేరుతో ఈ సినిమా తీశాడు.
‘విక్రమార్కుడు’ కథకుడైన విజయేంద్ర ప్రసాద్.. హిందీలో ఈ సినిమాకు సీక్వెల్ తీసే బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ స్టూడియో ఆయనకు ఈ పని అప్పగించింది. గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘రౌడీ రాథోడ్’ సీక్వెల్ కోసం కథ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర వెల్లడించారు. ఇప్పుడు ఆ పని పూర్తయినట్లు సమాచారం.
హిందీతో పాటు తెలుగులోనూ ‘విక్రమార్కుడు’ సీక్వెల్ తీయబోతున్నారన్నది తాజా కబురు. హిందీలో అక్షయ్ కుమారే లీడ్ రోల్ చేయనుండగా.. తెలుగులో రవితేజనే సీక్వెల్లో నటించబోతున్నాడట. కొన్ని రోజుల ముందు వరకు తెలుగు వెర్షన్ విషయంలో ఏ చర్చా లేదు కానీ.. ఇప్పుడు ‘విక్రమార్కుడు-2’ తీయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారట. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది.
ఐతే సీక్వెల్‌కు రాజమౌళి దర్శకత్వం వహించబోవట్లేదు. ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలే తీస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబుతో ఓ సినిమాకు ఆయన రెడీ అవుతున్నారు. వేరే ఎవరైనా మాస్ డైరెక్టర్‌ను పెట్టుకుని ఈ సినిమా తీసే అవకాశముంది. త్వరలోనే ఈ చిత్రం గురించి ప్రకటన రానున్నట్లు సమాచారం.
This post was last modified on September 19, 2021 3:09 pm
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…