రామ్ గోపాల్ వర్మ చెప్పే అన్ని మాటలూ నిజం అని అనుకోలేం. ఆయన ప్రకటించే అన్ని ప్రాజెక్టులూ కార్యరూపం దాలుస్తాయన్న గ్యారెంటీ లేదు. గత కొన్నేళ్లలో ఆయన అనౌన్స్ చేసిన ఎన్నో చిత్రాలు అటకెక్కేసిన మాట వాస్తవం. న్యూక్లియర్ పేరుతో ఓ అంతర్జాతీయ సినిమా అంటూ హడావుడి చేయడం.. తర్వాత అది అడ్రస్ లేకుండా పోవడం గుర్తుండే ఉంటుంది. అయినా సరే.. ఎప్పటికప్పుడు క్రేజీ సినిమాలు ప్రకటించడం వర్మకు అలవాటే. ఇప్పుడు అలాంటిదే ఇంకోటి అనౌన్స్ చేశాడు ఈ వివాదాస్పద దర్శకుడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీయబోతున్నాడట. శనివారం ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా వర్మ ఈ సినిమా గురించి వెల్లడించాడు.
ఉపేంద్రకు హ్యాపీ బర్త్‌డే చెబుతూ.. తనతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు వర్మ. ఐతే ఉపేంద్ర నుంచి అయితే దీనిపై ఎలాంటి స్పందన లేదు. అతనేమీ ఈ వార్తను ధ్రువీకరించలేదు. వర్మకు రిప్లై కూడా ఇవ్వలేదు. ఉపేంద్ర పుట్టిన రోజని తెలిసి సరదాకి వర్మ ఈ సినిమాను అనౌన్స్ చేశాడా.. లేక సీరియస్‌గానే అతడితో సినిమా చేసే ఉద్దేశం ఉందా అన్నది వర్మకే తెలియాలి. వీళ్లిద్దరూ మంచి ఫాంలో ఉన్న సమయంలో కలిసి సినిమా చేసి ఉంటే ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండేది కాదు. 90వ దశకంలో ఈ ఇద్దరూ మామూలు సంచలనం రేపలేదు.
బాలీవుడ్లో వర్మ.. రంగీలా, శివ, సత్య లాంటి చిత్రాలతో ప్రకంపనలు రేపితే.. సౌత్‌లో ఓం, ఉపేంద్ర, ఎ లాంటి చిత్రాలతో ఉపేంద్ర షేక్ చేశాడు. ఈ ట్రెండ్ సెట్టర్స్ అప్పట్లో కనుక కలిసి సినిమా చేసి ఉంటే అదొక పెద్ద సెన్సేషన్ అయ్యేది. ఇప్పుడు ఉపేంద్ర సైతం ఫాం కోల్పోగా.. వర్మ సంగతి చెప్పాల్సిన పనే లేదు.
This post was last modified on September 19, 2021 9:59 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…