ప్రస్తుతం దక్షిణాదిన మేటి నటుల్లో ఒకడిగా, అత్యంత డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి. సుకుమార్ లాంటి మేటి దర్శకుడు ‘పుష్ప’లో ఛాన్స్ ఇస్తానన్నా ఒప్పుకోలేనంత బిజీ నటుడతను. బాలీవుడ్లో సైతం ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం అడిగితే డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడు. ఇక దక్షిణాదిన కథానాయికగా మామూలు సినిమాలే చేసి, బాలీవుడ్లో మంచి మంచి సినిమాలతో గొప్ప ఇమేజ్ సంపాదించిన నటి తాప్సి. ఆమె కూడా సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటోంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకోవట్లేదు.
ఇలాంటి ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కథ విషయంలో.. వీళ్ల పెర్ఫామెన్స్ విషయంలో ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. కానీ ‘అనాబెల్ సేతుపతి’ సినిమా ఈ ఆశలు, అంచనాలకు దరిదాపుల్లో కూడా నిలవలేదు.
మన దగ్గర ఎన్నో ఏళ్ల ముందే పీల్చి పిప్పి చేసేసిన హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఐతే విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటించారు.. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాధిక, యోగి బాబు లాంటి పేరున్న ఆర్టిస్టులో కీలక పాత్రలు పోషించారు కాబట్టి ఇందులో ఎంతో కొంత కొత్తదనం, కొన్ని విశేషాలు ఉంటాయని ఆశిస్తే అలాంటివేమీ సినిమాలో కనిపించలేదు. ఎప్పుడో చూసిన పాత చింతకాయ పచ్చడి హార్రర్ కామెడీ సీన్లే వీటిలోనూ రిపీట్ చేశారు.
హార్రర్ కామెడీ అనగానే ఒక పెద్ద గుంపు.. ఒక పెద్ద భవనంలోకి వెళ్లడం.. అక్కడ దయ్యాల్ని చూసి భయపడటం.. ఒక ఫ్లాష్ బ్యాక్.. ఇలా రొటీన్ టెంప్లేట్లో సాగిపోయిన సినిమా ఇది. ఊరికే హడావుడి తప్పితే సినిమాలో ఏమీ లేదు. చూసిన వాళ్లంతా ఇదేం సినిమా అంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడమేంటని తిడుతున్నారు. అన్నిటికంటే మించి సేతుపతి, తాప్సి ఏం చూసి ఈ సినిమా ఒప్పుకున్నారన్నది అర్థం కావడం లేదు.
This post was last modified on September 18, 2021 7:04 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…