వయసు పెరిగినా.. గ్లామర్ తగ్గినా.. అనుష్కకు తెలుగు, తమిళ భాషల్లో ఉన్న డిమాండే వేరు. అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ అనుష్కే సినిమాలు ఒప్పుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. చివరగా ‘నిశ్శబ్దం’ సినిమాతో పలకరించిన ఆమె.. దాని తర్వాత ఇప్పటిదాకా ఏ సినిమా ఒప్పుకున్నట్లు కనిపించలేదు. మధ్యలో నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక వెరైటీ సినిమా ఏదో చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. ఎంతకీ ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. దీని గురించి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు.
దీంతో అనుష్క తర్వాత నటించే సినిమా ఏదనే విషయంలో అయోమయం కొనసాగుతోంది. ఐతే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క తమిళంలో ఓ సినిమా చేయబోతోందట. చివరగా తమిళంలో ‘సింగం-2’లో నటించిన అనుష్క.. ఆ తర్వాత కోలీవుడ్ వైపు చూడలేదు.
నాలుగేళ్లకు పైగా విరామం తర్వాత అనుష్క తమిళంలో ఓ సినిమా అంగీకరించిందని.. అది చాలా స్పెషల్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘చంద్రముఖి’కి ఇప్పుడు తమిళంలో సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే ఇందులో రజినీకాంత్ నటించట్లేదు. ఆయన స్థానాన్ని రాఘవ లారెన్స్ భర్తీ చేయబోతున్నాడు. ‘చంద్రముఖి’ దర్శకుడు పి.వాసునే ఈ చిత్రాన్ని కూడా రూపొందించనున్నాడు. ఆయన ఇప్పటికే కన్నడలో, తెలుగులో ‘చంద్రముఖి’ సీక్వెల్స్ తీశాడు. రెండు చోట్లా ఒకే కథతో సినిమా తెరకెక్కింది. ఐతే కన్నడలో విజయవంతమైన సినిమా.. తెలుగులో మాత్రం డిజాస్టర్ అయింది.
ఐతే ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టి.. తమిళంలో వేరే కథతో ‘చంద్రముఖి-2’ తీయబోతున్నాడు. ఈ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా కాలమైంది. కానీ సినిమా పట్టాలెక్కలేదు. త్వరలోనే షూటింగ్ మొదుల కానుందట. ఇందులో చంద్రముఖి పాత్రను అనుష్క చేయబోతోందని.. సినిమాలో ఆమెదే అత్యంత ముఖ్యమైన పాత్ర అని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.
This post was last modified on September 18, 2021 6:50 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…