సమంతని ఇంప్రెస్ చేసిన కథ!

అక్కినేని సమంత ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా తరువాత కొన్నిరోజులు గ్యాప్ తీసుకుంటానని చెప్పింది. ఈ మధ్యకాలంలో తన స్నేహితులతో కలిసి తెగ ట్రిప్ లు వేస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె ముంబైలో ఇల్లు కొనుక్కుందని.. త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంతకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని.. ఇక తెలుగు సినిమాలు చేయదంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఇప్పుడు సడెన్ గా ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. ఈ కథ సమంతకు ఎంతగా నచ్చిందంటే.. ఈ ఏడాది నవంబర్ నుంచే షూటింగ్ లో పాల్గొనడానికి ఒప్పేసుకుంది. అంతగా తన కథతో సమంతను మెప్పించాడు ఓ కొత్తకుర్రాడు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని టాక్. ఇప్పటివరకు ఏ భాషలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదట. అందుకే సమంత కథ విన్న వెంటనే కాల్షీట్స్ ఇచ్చేసింది.

ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించబోతున్నారు. గతంలో ఈయన నిర్మించిన ‘ఆదిత్య369’ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. రీఎంట్రీలో ఈ ప్రొడ్యూసర్ నిర్మించిన ‘జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈసారి సమంత సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!