Movie News

‘భవదీయుడు భగత్ సింగ్’ హీరోయిన్ ఫైనల్!

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది పూజాహెగ్డే. ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలను పూర్తి చేసింది పూజాహెగ్డే. ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. పూజాహెగ్డే ఇప్పుడు మరో సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా పవన్ పుట్టినరోజునాడు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకోబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా పూజాహెగ్డే ఈ సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి హీరోయిన్ గా ఆమె ఫైనల్ అయినట్లే. పూజాహెగ్డే తొలిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించబోతుంది. హరీష్ శంకర్ తో మాత్రం ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు ఇది మూడో సినిమా కావడం విశేషం.

దర్శకనిర్మాతలు త్వరలోనే పూజాహెగ్డే పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’ సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డారు.

This post was last modified on September 16, 2021 11:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

2 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

3 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago