కరోనా పుణ్యమా అని గత ఏడాదిన్నర కాలంలో ఎన్ని సినిమాలు ఎన్నిసార్లు రిలీజ్ డేట్లు మార్చుకున్నాయో తెలిసిందే. ఇంతకుముందు లాగా ఒక సినిమా వాయిదా పడుతుంటే జనాలేమీ ఆశ్చర్యపోవట్లేదు. గత వారం వచ్చిన సీటీమార్, ఈ వారం వస్తున్న గల్లీ రౌడీ కూడా ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదా పడ్డవే. వచ్చే వారానికి షెడ్యూల్ అయిన లవ్ స్టోరి ఇంతకుముందు రెండుసార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
అక్టోబరు 1న రావాల్సిన సాయిధరమ్ తేజ్ సినిమాకు కూడా ఇంతకుముందు ఒక డేట్ అనుకుని అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేశారు. అయితే తాజా డేట్ అక్టోబరు 1న కూడా ఈ సినిమా విడుదల కాకపోవచ్చని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగానే జరుగుతున్నాయి.
కానీ అంతా ఓకే అనుకుంటున్న సమయంలో తేజు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడికి మరీ తీవ్ర గాయాలేమీ కాలేదు. ప్రాణాపాయం లేదు. కానీ గాయాల నుంచి కోలుకుని మామూలుగా తిరగడానికి మాత్రం టైం పట్టేలా ఉంది. వచ్చే నెల రోజుల్లో మాత్రం ఇది జరగకపోవచ్చని తెలుస్తోంది. అతడి కాలర్ బోన్‌కు శస్త్రచికిత్స కూడా జరగడం తెలిసిందే. తేజు మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి రావచ్చు. ఇంటికి చేరుకున్నా బయటికి రావడానికి టైం పడుతుంది. సినిమా ప్రమోషన్లకు హీరోనే అత్యంత కీలకం. తేజు అలా ఉండగా ప్రమోషణ్లకు రాలేడు.
ప్రమోషన్ల సంగతలా ఉంచితే.. తేజు ఈ స్థితిలో ఉండగా సినిమాను విడుదలకు సిద్ధం చేయడం కష్టమే. కాబట్టి అక్టోబరు 1 నుంచి ఈ చిత్రాన్ని వాయిదా వేయక తప్పకపోవచ్చని అంటున్నారు. తేజు పరిస్థితి చూసుకుని త్వరలోనే కొత్త డేట్ ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
This post was last modified on September 15, 2021 9:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…