పవన్ ప్రొడక్షన్ హౌస్ పై త్రివిక్రమ్ ఫోకస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. పవన్ నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం.. మహేష్ తో తను చేయాల్సిన సొంత సినిమా పనులను పక్కన పెట్టేశాడు త్రివిక్రమ్. ‘భీమ్లా నాయక్’ సినిమా సెట్ లో త్రివిక్రమ్ ఉండాల్సిందేనని పవన్ పట్టుబట్టాడు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన చాలా వ్యవహారాలను త్రివిక్రమ్ సెటిల్ చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి అప్పగించినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని మళ్లీ ట్రాక్ లో పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. ప్రస్తుతం ఓటీటీల డిమాండ్ బాగా పెరిగింది. వాటికోసం చిన్న సినిమాలు చేయాలని.. అలానే రామ్ చరణ్ తో ఓ భారీ సినిమాల చేయాలని.. నితిన్ తో మరో సినిమా ఇలా ఇవన్నీ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు పవన్. కానీ అవి ముందుకు కదలడం లేదు. నటుడిగా పవన్ బిజీగా ఉండడంతో నిర్మాణ బాధ్యతలు చూసుకునేవారు లేరు.

ఇప్పుడు ఆ బాధ్యతలను కూడా త్రివిక్రమ్ చేతుల్లో పెట్టారట. కథ వినడంతో పాటు దర్శకులను సెలెక్ట్ చేయడం, ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే పనులన్నీ త్రివిక్రమ్ చూసుకోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు సినిమాను మొదలుపెట్టకముందే.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కోసం ఓ కథను సెట్ చేసి.. షూటింగ్ మొదలుపెట్టించాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ లో త్రివిక్రమ్ కి వాటా ఉంటుందా..? లేక పవన్ సోలోగా సినిమాను నిర్మిస్తారా అనేది చూడాలి!