ఒక హీరో స్టార్ ఇమేజ్ సంపాదించాక అతడి కుటుంబంలోని వేరే వాళ్లు ఇండస్ట్రీలోకి రావడం కామనే. హీరో తమ్ముడో కొడుకో అయితే నటనలోకే అడుగు పెడతారు. అతడి కుటుంబంలోని అమ్మాయిలైతే నటనలోకి వెళ్లొచ్చు. లేదా కాస్ట్యూమ్ డిజైనర్ లాంటి బాధ్యతలు చేపడుతుంటారు. కానీ ఒక హీరో అక్క డైరెక్టర్ కావడం మాత్రం అనూహ్యమైన విషయం.
నాని సోదరి దీప్తి ఇలాగే షాకిచ్చింది. ఆమె దర్శకత్వంలో నాని నిర్మాణంలో ‘మీట్ క్యూట్’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అప్పుడే చివరి దశకు కూడా వచ్చేసింది. ఒక ప్రముఖ ఓటీటీ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని కూడా అంటున్నారు. సత్యరాజ్, రుహాని శర్మ, రోహిణి, వర్ష బొల్లమ్మ, ఆదాశర్మ, సునైనా, సంచిత తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఐతే ఈ సినిమా అసలెలా మొదలైందో.. తన అక్క దీప్తి ఎలా మెగా ఫోన్ పట్టిందో ఒక ఇంటర్వ్యూలో నాని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ సంగతులు అతడి మాటల్లోనే..
‘‘మా అక్క నాకు ఫ్యాన్. ఐతే ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన తనకెప్పుడూ లేదు. కానీ రైటింగ్ అంటే తనకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన ఆలోచనల్ని పేపర్ మీద పెడుతుంటుంది. అలా రాసినవి నాకు పంపిస్తుంటుంది. ఓరోజు నాకు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నా.. ఏం చేయాలి అంది. సరే ఆన్‌లైన్‌లో హాలీవుడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి.. వాటిని చూడు ఓ అవగాహన వస్తుందని చెప్పా. అలా కొన్ని స్క్రిప్టులు చూసి అవగాహన తెచ్చుకుని ఒక ఆంథాలజీ స్క్రిప్టు రాసింది. అది చదివి ఎలా ఉందో చెప్పమని నాకు పంపింది. నేను పెద్దగా పట్టించుకోలేదు. మనం మన ఇంట్లో అక్కల్ని, చెల్లెళ్లని, తమ్ముళ్లని తక్కువ అంచనా వేస్తాం కదా.. నేనూ అలాగే లైట్ తీసుకున్నా. కానీ ఒక రోజు మా కజిన్స్ ఫోన్ చేసి.. ‘దీప్తీ స్క్రిప్ట్ చదివావా? ఎంత బాగా రాసిందో.. అదిరిపోయింది’ అన్నారు. సర్లే అంతగా ఏం రాసిందోనని నేనూ చదివా. చాలా అందంగా.. ఓ గొప్పగా కథ రాసినట్లనిపించింది. వెంటనే ఇదే విషయాన్ని ఫోన్ చేసి తనకి చెప్పా. చాలా హ్యాపీగా ఫీలైంది. ఆ స్క్రిప్ట్ నాకు పనికొస్తే వాడుకోమంది. కానీ ఇంత మంచి కథ రాసిన నువ్వే దాన్ని తెరకెక్కించమని చెప్పా. తన వల్ల కాదంది. కానీ నేను ఒక మంచి టీంని తనకిచ్చి సినిమా తీయమని చెప్పా. ‘మీట్ క్యూట్’ విడుదలయ్యాక తనకు చాలా ఆఫర్లు వస్తాయి. నన్ను కూడా పట్టించుకోక పోవచ్చు’’ అని నాని అన్నాడు.
This post was last modified on September 14, 2021 3:04 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…