టాలీవుడ్ ఇప్పుడో సమావేశం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఆ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని తెలుగు సినీ ప్రతినిధుల బృందానికి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెలన్నర ముందే ఈ మీటింగ్ గురించి సమాచారం బయటికి వచ్చినప్పటికీ.. అది కార్యరూపం దాల్చడానికి బాగా టైం పట్టేసింది. ఎట్టకేలకు ఈ నెల 20న చిరు బృందానికి జగన్ దగ్గర అపాయింట్మెంట్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం టాలీవుడ్ భవితవ్యాన్ని నిర్దేశిస్తుందని భావిస్తున్నారు.
టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రణను ఎత్తేయడంతో పాటు.. నైట్ షోలకు అనుమతులివ్వడం.. అవసరాన్ని బట్టి అదనపు షోలు, బెనిఫిట్ షోలు వేసుకునే.. టికెట్ల రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించడం.. లాంటి వరాల కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఏపీలో థియేటర్లలో సానుకూల పరిస్థితులు లేక పేరున్న సినిమాలు చాలానే విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. ఏపీలో పరిస్థితులు చక్కబడ్డాకే రిలీజ్ చేద్దామని చాలా చిత్రాలను ఆపారు. ‘లవ్ స్టోరి’ కూడా అలా ఆగిన సినిమానే. ఐతే ఈ మీటింగ్ గురించి స్పష్టత రాకముందే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ఈ నెల 24న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇంతలో మీటింగ్ డేట్ వచ్చింది. చిరు బృందంలో అక్కినేని నాగార్జున కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ బృందంలో అందరికంటే జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నది నాగార్జునకే. ఇలాంటి మీటింగ్స్ బాగా డీల్ చేయగలడనీ నాగ్‌కు పేరుంది. కాబట్టి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్‌కు నాగ్ సావధానంగా వివరించి సానుకూల ఫలితం రాబడతాడని ఆశిస్తున్నారు. ఆయనది చేయగలిగితే ముందుగా లాభపడేది కొడుకు చైతూ సినిమానే. ఏపీలో టికెట్ల రేట్లు, నైట్ షోల సమస్య తీరిపోతే ‘లవ్ స్టోరి’ ఎంతగా కలిసొస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి నాగ్ ఈ మీటింగ్‌లో జాగ్రత్తగా డీల్ చేసి కొడుక్కి గిఫ్ట్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on September 14, 2021 2:27 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…