ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధుల బృందం సమావేశం కాబోతోందని నెలా నెలన్నర కిందటే వార్తలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరలతో పాటు వివిధ సమస్యలపై చర్చించేందుకు ఉద్దేశించిన ఈ మీటింగ్‌కు ఆహ్వానిస్తూ మంత్రి పేర్ని నాని.. చిరు బృందాన్ని కలవడం.. ఆ తర్వాత ఈ మీటింగ్‌లో ఏం మాట్లాడాలన్నదానిపై మెగాస్టార్ సినీ పెద్దలతో సమావేశం నిర్వహించడం తెలిసిందే.
ఐతే ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఆ సమావేశం మాత్రం ఎంతకీ జరగట్లేదు. సీఎం జగన్ సిమ్లా పర్యటన అనంతరం మీటింగ్ అన్నారు కానీ.. ఆ తర్వాత కూడా చప్పుడు లేదు. దీంతో అసలీ మీటింగ్ ఉంటుందా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఐతే ఎట్టకేలకు ఈ సమావేశానికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం.
ఈ నెల 20వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని చిత్రపరిశ్రమ బృందం కలవనున్నట్లు సమాచారం. జగన్‌తో అపాయింట్మెంట్‌ను ఖరారు చేస్తూ మంత్రి పేర్ని నాని నుంచి చిరు బృందానికి సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సమావేశంలో హీరో నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్‌బాబు తదితరులు పాల్గొనున్నారట.
వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లపై నియంత్రణ తీసుకురావడం టాలీవుడ్‌కు తీవ్ర ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమస్యతో పాటు కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వాలని.. కరోనా షరతులు తొలగించి నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించాలని ఈ సమావేశంలో జగన్‌కు చిరు బృందం విన్నవించనుంది. అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టనున్న టికెట్ల విక్రయానికి సంబంధించిన యాప్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
This post was last modified on September 14, 2021 8:03 am
అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన…
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. ఆయన కలలు కంటున్న రాజధాని అమరావతి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది.…
వైసీపీలో నాయకులు చాలా మంది డి-యాక్టివేషన్లో ఉన్నారు. కాకలు తీరిన కబుర్లు చెప్పిన నాయకులు కూడా మౌనంగా ఉంటూ.. రమణ…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు .. రాష్ట్ర రాజధాని అమరావతిపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అదేసమయంలో రాజధాని…
ఈసారి ఐపీఎల్ మొదలవుతుండగా.. అందరి కళ్లూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదే నిలిచాయి. ఆ జట్టును టైటిల్‌కు హాట్ ఫేవరెట్‌గా పేర్కొన్నారు…
దేవతా భూమిగా.. అజరామరమైన దేవేంద్రుడి రాజధానిగా ప్రధాన మంత్రి అభివర్ణించిన అమరావతి రాజధాని సాకారం కావాలనేది యావత్ తెలుగు ప్రజల…