ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతుందనే గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాన్ని సామ్ కానీ చైతు కానీ పెద్దగా పట్టించుకున్నట్లుగా లేరు. ఇదిలా ఉండగా.. సమంత తన కెరీర్ కి సంబంధించి ఓ కీలకనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే సమంత ముంబైకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమాను సైన్ చేయబోతోందని టాక్.
గతంలో కూడా ఆమెకి బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు ఆమె హిందీ సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతుందని సమాచారం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. వెబ్ సిరీస్ లో ఆమె పెర్ఫార్మన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పైగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మేకర్స్ సౌత్ హీరోయిన్ల వైపు చూస్తున్నారు. షారుఖ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించబోతుంది నయనతార. అందుకే ఇప్పుడు సమంత కూడా ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకుందట.
ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని.. అక్కడ తనకంటూ ఓ పీఆర్ నీ, మేనేజర్ ని నియమించుకుందని తెలుస్తోంది. కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా.. అని సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ బ్రేక్ అవ్వగానే.. బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేయబోతుంది. రీసెంట్ గా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తోంది.
This post was last modified on September 13, 2021 11:57 am
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…