నటుడు ఉత్తేజ్ భార్య కన్నుమూత..!

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సినీ నటుడు ఉత్తేజ్ భార్య కన్నుమూశారు. అనారోగ్యంతో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ఉత్తేజ్ భార్య గత కొంతకాలం గా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో తో ఈరోజు ఉదయం ఉత్తేజ్ భార్య కన్నుమూశారు. దాంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. దీంతో ఉత్తేజ్‌కు, ఆయన కటుంబ సభ్యులకు సీనీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్‌ రాజ్‌ ,జీవిత రాశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్‌ను పరామర్శించారు.