గోపీచంద్ హీరో.. నయనతార హీరోయిన్.. బి.గోపాల్ దర్శకుడు.. ఇంత పెద్ద కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా విడుదలకు నోచుకోకుండా ఏళ్లకు ఏళ్లు ఆగిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ముందు భూపతి రాజా అనే తమిళ దర్శకుడు ఈ సినిమాను మొదలుపెట్టి.. మధ్యలో అతను తప్పుకుంటే గోపాల్ డైరెక్టర్ చైర్‌లోకి వచ్చారు. ఆయనే సినిమాను పూర్తి చేశారు. ఆరడుగుల బుల్లెట్ అంటూ ఈ చిత్రానికి మాస్ టైటిల్ కూడా పెట్టారు. సినిమా పూర్తయింది. త్వరలో విడుదల అన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో సినిమా బయటికి రాలేదు.
ఐదేళ్ల ముందే విడుదల కావాల్సిన సినిమా వాయిదాల మీద వాయిదా పడింది. ఒక దశలో విడుదలకు అన్నీ సిద్ధం చేసి పత్రికల్లో యాడ్స్ ఇచ్చి.. థియేటర్ల లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అంతా ఓకే అనుకున్నాక విడుదల రోజు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఆరడుగుల బుల్లెట్ అడ్రస్ లేదు.
ఐతే చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ చిత్రాన్ని వార్తల్లోకి తీసుకొచ్చారు. అక్టోబర్ రిలీజ్ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. బహుశా గోపీచంద్ కొత్త సినిమా సీటీమార్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని, మంచి ఓపెనింగ్స్‌తో సాగుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందంలో ఉత్సాహం వచ్చినట్లుంది. ఫైనాన్స్ సమస్యలన్నీ తొలగించుకుని నిజంగానే అక్టోబరు రిలీజ్‌కు ఈ చిత్రం రెడీ అవుతున్నట్లుగా ఉంది. బాలాజి రియల్ మీడియా బేనర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ కావడం విశేషం.
మరి ఏడెనిమిదేళ్ల ముందు రాసిన స్క్రిప్టుతో ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో చూడాలి. సినిమా మీద పెద్దగా అంచనాల్లేవు కానీ.. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఎలాగోలా రిలీజైతే అదే చాలని దాని టీం అనుకుంటోంది.
This post was last modified on September 12, 2021 5:43 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…