సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేష్ వలీయశాల(54) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది నటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్ధిక సమస్యలు, డిప్రెషన్ ఇలా పలు కారణాల వలన లైఫ్ లీడ్ చేయలేక సూసైడ్ ను ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. సుశాంత్ రాజ్ పుత్ మరణం తరువాత ఇండస్ట్రీలో ఇలాంటి చావు వార్తలు వింటూనే ఉన్నాం.
దాదాపు 22 ఏళ్లుగా సినీ పరిశ్రమలో పని చేస్తోన్న రమేష్ వలీయశాల శనివారం ఉదయం తిరువనంతపురంలోకి తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయన మరణవార్తతో మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
కేరళ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్, సినిమాలు చేస్తూ నటుడిగా బిజీగా ఉండే రమేష్ ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే రమేష్ వలీయశాల షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారని.. ఇంతలో జీవచ్ఛవంలా కనిపించడంతో అతడి కుటుంబసభ్యులు, సహనటులు తట్టుకోలేకపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates