షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రీతూవర్మ ఆ తరువాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన పెర్ఫార్మన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. అలానే కోలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది రీతూవర్మ. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తను పుట్టి, పెరిగింది హైదరాబాద్ లోనే కానీ.. మూలాలు మాత్రం నార్త్ లో ఉన్నాయని చెబుతోంది. తన ఫ్యామిలీ ఉత్తరాది నుంచి ఇక్కడకి వలస వచ్చిందని తెలిపింది. తను హైదరాబాద్ లో పుట్టి పెరగడం వలన అందరూ పక్కా తెలుగమ్మాయి అనుకుంటారని.. ఇంట్లో అయితే నార్త్, సౌత్ రెండు కల్చర్స్ ఉంటాయని చెప్పింది. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలు చూసి పెరిగానని.. తెలుగు సినిమాలు చూసింది తక్కువే అయినా.. తెలుగంటే ఇష్టమని చెప్పుకొచ్చింది.
త్వరలోనే ఓటీటీలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు చెప్పింది. అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సిరీస్ ఓకే చేశానని.. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపింది. వెబ్ సిరీస్ లో ఎక్స్ పోజింగ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుందేమో అని ప్రశ్నిస్తే.. గ్లామర్ రోల్స్ కి తను వ్యతిరేకంగా కాదని.. కానీ ఇప్పటివరకు అలాంటి పాత్రలు రాలేదని చెప్పింది. అలా అని గ్లామర్ కి దూరమని అనుకోవద్దని క్లారిటీ ఇచ్చింది.
This post was last modified on September 9, 2021 5:59 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…