Movie News

‘సీటీమార్’ దర్శకుడి భయం

ఇంకొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘సీటీమార్’. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా అన్న సంగతి తెలిసిందే. తెలుగులో క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాలు తక్కువ. అందులోనూ రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాలు మరీ అరుదు. ‘జెర్సీ’ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే ఈ కోవలో కనిపిస్తాయి. ‘సీటీమార్’ టీజర్, ట్రైలర్ చూస్తే స్పోర్ట్స్ టచ్ ఉంటూనే.. మాస్, యాక్షన్ అంశాలను హైలైట్ చేస్తూ సైినిమా తీశారని స్పష్టమైంది.

రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాలకు హిందీలో మంచి ఆదరణ దక్కుతుంటుంది కానీ.. తెలుగులో అలాంటివి కమర్షియల్‌గా అంత మంచి ఫలితం దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ‘జెర్సీ’ గొప్ప సినిమా అయినా.. ఆ స్థాయిలో కమర్షియల్‌ సక్సెస్ కాని విషయం గమనార్హం.

అందుకే దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని ప్యూర్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పట్లేదు. ప్రేక్షకులు అలా అనుకుంటారేమో అన్న భయం కూడా అతడిలో కనిపిస్తోంది. అలాంటి ఫీలింగే ప్రేక్షకులకు కలగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ‘సీటీమార్’ ప్రమోషన్లలో ఇది పక్కా మాస్ మూవీ అనే చెబుతున్నాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో సైతం అతను ఇదే సంకేతాలు ఇచ్చాడు. దంగల్, చక్ దె ఇండియా తరహా సినిమా ‘సీటీమార్’ కాదంటూ బలంగా చెప్పాడతను.

స్పోర్ట్స్ టచ్ ఉంటుంది కానీ.. అదే ప్రధానం కాదని.. ఇదొక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అతను నొక్కి వక్కాణించాడు. గోపీచంద్ సినిమాలంటే మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అతణ్నుంచి ప్రధానంగా ఆశించేది యాక్షన్, కమర్షియల్ అంశాలే. అందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కూడా కట్ చేశాడు సంపత్ నంది. ‘గౌతమ్ నంద’తో కొంచెం కొత్తగా ఏదో ట్రై చేసి దెబ్బ తిన్న సంపత్.. ఈసారి పక్కా మాస్ మూవీ తీసినట్లే కనిపిస్తున్నాడు.

This post was last modified on September 9, 2021 2:41 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

11 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

12 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

13 hours ago