Movie News

చరణ్ కోసం ట్రెండ్ సెట్ట‌ర్స్‌ని తీసుకొచ్చారు


మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సినిమా ముహూర్తానికి రంగం సిద్ధమైంది. శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించబోతున్న కొత్త సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం పట్టాలెక్కడానికి ముందే ఒక ఫొటో షూట్ కూడా చేశాడు శంకర్. ప్రారంభోత్సవానికి ముందు రోజే ఈ షూట్ చేయడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చాలా పెద్ద స్థాయిలో ఈ ఫొటో షూట్ చేశారు.

ఇందులో హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొన్నారు. ఈ షూట్‌తో పాటు ముహూర్త వేడుకలో పాల్గొనడం కోసం కియారా ముంబయి నుంచి దిగింది. ఇక శంకర్ ఏం చేసినా ఒక రేంజిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటో షూట్ కూడా అంతే. రెగ్యులర్ కెమెరామన్లతో కాకుండా స్పెషల్ టెక్నీషియన్ల‌తో ఈ షూట్ చేయించాడు శంకర్. వారి పేర్లు.. రాజీవ్ చుదాసమా, అవినాష్ గోవారిక‌ర్..ఫిలిం ఫొటో షూట్లలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన వ్యక్తులు వీళ్లు.

మార్చింగ్ యాంట్స్ పేరుతో 13 ఏళ్ల కిందట ఓ సంస్థను నెలకొల్పి మోడలింగ్, ఫిలిం ఫొటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించాడు రాజీవ్. అవినాష్ గోవారిక‌ర్‌కు ఫొటోగ్రాఫ‌ర్‌గా గొప్ప పేరే ఉంది. మ‌న మ‌హేష్ బాబు త‌ర‌చుగా అవినాష్‌తో ఫొటో షూట్లు చేయించుకుంటాడు. ఈ మ‌ధ్య కూడా అవినాష్ చేసిన ఒక ఫొటో షూట్లో మ‌హేష్ హాలీవుడ్ హీరోలాగా క‌నిపించాడు. రాజీవ్ సంస్థ ఇప్పటిదాకా సినిమాలతో పాటు వివిధ రకాలైన 2500 పోస్టర్లు డిజైన్ చేయడం విశేషం. బాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలకు పోస్టర్ డిజైన్ చేసిన ఘనత అతడిదే.

సౌత్‌లో పెద్దగా పని చేయని రాజీవ్‌ను చరణ్ సినిమా కోసం శంకర్ తీసుకొచ్చాడు. ఫొటో షూట్లు, డిజైనింగ్ కోసం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ రాజీవ్‌, అవినాష్‌. ఔట్ పుట్ కూడా ఆ రేంజిలోనే ఇస్తారు. కాబట్టి శంకర్-చరణ్ సినిమా ఫొటో షూట్ విజువల్స్, పోస్టర్ల మీద భారీ అంచనాలే పెట్టుకోవచ్చు. అగ్ర నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చబోతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on September 7, 2021 10:15 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

33 mins ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

34 mins ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

42 mins ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

58 mins ago

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…

1 hour ago

ఉండి పై రఘురామ ఉడుం పట్టు.!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…

1 hour ago