సమంత ‘ఆబ్స్’ ను చూశారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు సిక్స్ ప్యాక్ పిచ్చి ఉంటుంది. దీనికోసం గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేస్తుంటారు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు సిక్స్ ప్యాక్ ఉంది. అయితే మేల్ స్టార్స్ మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. తమ బాడీను ఫిట్ గా ఉంచుకుంటూ.. ఆబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. రకుల్, సమంత లాంటి తారలు ఈ లిస్ట్ లో ముందుంటారు. సమంత జిమ్ లో వెయిట్ లిఫ్ట్ లు చేస్తూ తన పొట్టను ఫ్లాట్ చేసేసింది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో ‘ఆబ్స్’ను గమనించవచ్చు. ఎక్కడా కూడా ఫ్యాట్ లేకుండా.. పెర్ఫెక్ట్ ప్యాక్ తో కూడిన బాడీతో ఆశ్చర్యపరిచింది. సమంత ఫిట్ నెస్ ఫ్రీక్ అనే సంగతి మనకి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వర్కవుట్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ హ్యాండ్ బ్యాగ్ కి సంబంధించిన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోల్లో సమంత బాడీకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఒక్క ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ తోనే ఈ బ్యూటీ లక్షల్లో సంపాదిస్తుంది. రీసెంట్ గా సమంత ట్రిప్ కు వెళ్లింది. దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా బిజీగా గడుపుతోంది. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్న సమంత త్వరలోనే మరిన్ని సినిమాలు చేయబోతుంది.