Dil Raju
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లానింగ్ మామూలుగా లేదు ఈ మధ్య. వరుసగా క్రేజీ కాంబినేషన్లలో భారీ చిత్రాలను లైన్లో పెడుతున్నారాయన. చివరగా ‘వకీల్ సాబ్’ లాంటి క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజు.. తెలుగులో ‘ఎఫ్-3’, ‘రౌడీ బాయ్స్’ చిత్రాలతో పాటు హిందీలో జెర్సీ, ఎఫ్-2, హిట్, నాంది రీమేక్‌లతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత ఆయన మూడు మెగా చిత్రాలను మొదలుపెట్టాబోతున్నారు. క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కనున్న ఈ చిత్రాలకు ముహూర్తాలు కూడా పెట్టేసినట్లు సమాచారం.
ముందుగా వినాయక చవితి ముంగిట ఆయన తన ప్రొడక్షన్లో అతి పెద్ద సినిమాను మొదలుపెట్టబోతున్నారు. బుధవారం రామ్ చరణ్-శంకర్‌ల సినిమా ప్రారంభోత్సవం జరగనుందట. కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ వేడుక చేయనున్నారట. మెగాస్టార్ చిరంజీవి సహా కొందరు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. శంకర్ తెలుగులో చేయనున్న తొలి చిత్రం కావడం.. అందులోనూ రామ్ చరణ్ హీరో కావడంతో ఈ చిత్రంపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. వచ్చే ఏడాది వేసవి రిలీజ్ లక్ష్యంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు రాజు.
ఇక దసరాకు మరో భారీ చిత్రాన్ని రాజు మొదలుపెట్టనున్నాడట. అదే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించబోయే చిత్రం. ఈ సినిమా గురించి కొన్ని నెలల ముంగిటే సమాచారం బయటికి వచ్చింది. కానీ విజయ్ ‘బీస్ట్’ పనిలో బిజీగా ఉండి ఈ సినిమాకు అందుబాటులోకి రాలేకపోయాడు. దసరాకు ముహూర్తం చేసి, కొన్ని రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారట. ఇక అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ రూపొందించనున్న ‘ఐకాన్’ చిత్రాన్ని కూడా వచ్చే నెలలోనే రాజు మొదలుపెట్టించబోతున్నట్లు సమాచారం. బన్నీ ‘పుష్ప’ను ఎప్పుడు పూర్తి చేసి ఖాళీ అవుతాడన్నదాన్ని బట్టి దానికి ముహూర్తం నిర్ణయించనున్నారు.
This post was last modified on September 7, 2021 2:47 pm
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…
బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్…
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి మారితే మరోలా మాట్లాడుతున్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై పోలీసు…