తెలుగులో బిగ్ బాస్ కొత్త సీజన్ ఎట్టకేలకు మొదలైపోయింది. మూడు వారాల కిందటే ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసిన స్టార్ మా.. ఎక్కువ టైం తీసుకోకుండా షోను మొదలుపెట్టేసింది. అక్కినేని నాగార్జున వరుసగా మూడో పర్యాయం షోను హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్‌లో ఎన్నడూ లేని విధంగా, అత్యధికంగా 19 మంది కంటెస్టెంట్లతో ఈ సారి షో మొదలైంది. అందులో ఆకర్షణీయ వ్యక్తులు కొందరున్నారు. అప్పుడే వీరిలోంచి విజేతలయ్యే అవకాశాలున్న వాళ్ల గురించి చర్చ మొదలైపోయింది.
‘బిగ్ బాస్’ విజేత కావడానికి సోషల్ మీడియా ఫాలోయింగ్, సపోర్ట్ అత్యంత కీలకం. ఈ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ అందరి కంటే ముందుంటాడనడంలో సందేహం లేదు. యూట్యూబ్‌లో అతను పెద్ద స్టార్ అన్న సంగతి తెలిసిందే. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్‌కు మద్దతుగా భారీగా ఓట్లు పడే అవకాశముంది.
సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య లాంటి షోలతో షణ్ముఖ్ యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. వీటికి యూట్యూబ్‌లో వచ్చిన వ్యూస్ చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. అతను ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తుంటే.. యూత్ ఎగబడి చూశారు. షణ్ముఖ్ యూట్యూబ్ ఛానెల్‌కు భారీగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వాళ్లంతా అతడి అభిమానులే. అభిమానులు ముద్దుగా షన్ను అని పిలుచుకునే ఈ కుర్రాడు ఇప్పుడు బిగ్ బాస్‌లో అడుగు పెట్టడంతో వాళ్లందరూ ఈ షోను ఫాలో అవుతారనడంలో సందేహం లేదు.
షణ్ముఖ్ ఎప్పుడు ఎలిమినేషన్లోకి వచ్చినా అతడికి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. క్రౌడ్ ఫేవరెట్‌గా అడుగు పెడుతున్న షణ్ముఖ్ టైటిల్ రేసులో ఉంటాడనడంలో సందేహం లేదు. షోలో బ్లండర్స్ చేసి ఇమేజ్ దెబ్బ తీసుకుంటే తప్ప అతను ఫైనల్ రేసులో ఉండే అవకాశాలు మెండు. అతడితో మిగతా కంటెస్టెంట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. షణ్ముఖ్‌ను టార్గెట్ చేసే వాళ్లను.. అతడి అభిమానులు టార్గెట్ చేసే అవకాశాలు మెండు.
This post was last modified on September 6, 2021 1:07 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…